ETV Bharat / bharat

సముద్రంలో ల్యాండింగ్​ ఫెయిల్.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి

ఓఎన్​జీసీ హెలికాప్టర్​ ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ఓఎన్​జీసీ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సమయంలో హెలికాప్టర్​లో ఇద్దరు పైలట్లు సహా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు.

ఓఎన్​జీసీ హెలికాప్టర్
ఓఎన్​జీసీ హెలికాప్టర్
author img

By

Published : Jun 28, 2022, 1:45 PM IST

Updated : Jun 28, 2022, 5:36 PM IST

ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్​జీసీకి (ఆయిల్​ అండ్​ నేచురల్​ గ్యాస్​ కార్పొరేషన్​) చెందిన ఓ హెలికాప్టర్​ అరేబియా సముద్రంలో కుప్పకూలింది. గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తి హెలికాప్టర్​ను అత్యవసరంగా రిగ్​పై ల్యాండ్​ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఓఎన్​జీసీ ఉద్యోగులు. ప్రమాదం సమయంలో చాపర్​లో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది ఉన్నారు.

ముంబయి తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సముద్ర తీరం నుంచి సముద్ర మధ్యలోని రిగ్​పై ల్యాండ్​ కావాల్సిన హెలికాప్టర్​.. దానికి 1.5కిలోమీటర్ల దూరంలో ఫ్లోటర్ల ద్వారా అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని సురక్షింతంగా కాపాడారు. నలుగురు మాత్రం చనిపోయారు.

సముద్రంలోని నిక్షేపాల నుంచి ఆయిల్​, గ్యాస్​ను వెలికి తీసేందుకు సంస్థలు రిగ్​లను ఏర్పాటు చేస్తాయి. తీరం నుంచి సముద్రం మధ్యలోని రిగ్​లపైకి సిబ్బంది సహా ఇతర సామగ్రి, పదార్థాలను చేరవేసేందుకు హెలికాప్టర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని ఓఎన్​జీసీ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భూమిలో నోట్ల కట్టలు.. ట్రాక్టర్​తో దున్నుతుంటే బయటకు.. పోలీసులు వచ్చేలోపే..

Last Updated : Jun 28, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.