కేరళలో మరో జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. తాజాగా 73 ఏళ్ల ఓ వృద్ధురాలికి జికా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. మరోవైపు, పరీక్షలకు పంపిన ఐదు నమూనాలు నెగెటివ్‌గా తేలినట్లు కేరళ వైద్య శాఖ తన ప్రకటనలో తెలిపింది.
ఆదివారం ఓ చిన్నారి సహా ముగ్గురికి జికా సోకినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచేందుకు పినరయి సర్కారు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని నాలుగు వైద్య కళాశాలల్లో 2,100 టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధ పడుతున్నవారితో పాటు గర్భిణులకు పరీక్షలు చేయాలని ఆస్పత్రులను ఆదేశించింది.
కాగా, ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా బయటపడుతున్న వేళ జికా వైరస్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళకు.. వైద్యాధికారులతో కూడిన నిపుణుల బృందాలను కేంద్రం పంపించింది. ఎయిమ్స్‌కు చెందిన వైద్యులు ఉన్న ఆరుగురు సభ్యులున్న బృందం అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించనుంది.
ఇవీ చదవండి: