అసోంలో భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. మిజోరం పోలీసులు, అసోం రైఫిల్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఓ వ్యక్తి నుంచి రూ.12 కోట్లు విలువ చేసే 2,41,900 మెథాంఫేటామిన్ టాబ్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు.
కోలాసిబ్ జిల్లాలోని కాన్పుయి వెంగ్తార్ ప్రాంతంలో నిందితుడిని ఈ నెల 26న పోలీసులు అరెస్టు చేశారు.
"మార్చి 26న అసోం రైఫిల్స్, మిజోరాం పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో రూ.12.09 కోట్ల విలువైన 2,41,900 మెథాంఫేటామిన్ మాత్రలను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నాం. కోలాసిబ్ జిల్లాలోని కాన్పుయి ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేశాం."
-అసోం రైఫిల్స్ ట్వీట్
మారణాయుధాలు స్వాధీనం..
నాగా పీపుల్స్ ఫ్రంట్ కార్యకర్తల నుంచి అధికారులు అక్రమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో అసోం రైఫిల్స్, నాగాలాండ్ పోలీసులు సంయుక్తంగా జున్‌హెబోటో ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి. ముగ్గురు ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం) కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 32 ఎంఎం పిస్టల్స్, బులెట్లు, దోషపూరిత పత్రాలు ఉన్నాయి.