ETV Bharat / bharat

స్కూటీ ధర రూ.లక్ష.. ఫ్యాన్సీ నంబర్​ కోసం రూ.కోటి పెట్టిన వ్యక్తి! - HP999999 హిమాచల్ ప్రదేశ్ తాజా వార్తలు

సాధారణంగా రోడ్డుపై వెళ్లేటప్పుడు కొన్ని ఖరీదైన వాహనాల మోడళ్లు మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అలాగే వాటికి అమర్చే నంబరు ప్లేట్లు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఎందుకంటే అవి అన్ని వాహనాల కంటే కాస్త విచిత్రమైన సంఖ్యలను కలిగి ఉంటాయి. వీటినే ఫ్యాన్సీ, వీఐపీ, వీవీఐపీ నంబర్లు అంటాం. కొందరు ఇలాంటి ఫ్యాన్సీ సంఖ్యలు తమ వాహనాలకు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం వాహనం కొనేందుకు అయిన ఖర్చు కంటే ఎక్కువ కూడా చెల్లించడానికి వెనకాడరు. అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది.

One Crore Bid For Scooty In India
వేలంలో రూ.కోటి 11 వేలకు అమ్ముడుపోయిన ఫ్యాన్సీ నంబర్​​(వృత్తంలో)
author img

By

Published : Feb 16, 2023, 9:57 PM IST

హిమాచల్ ప్రదేశ్ శిమ్లాలో ఓ స్కూటీ రిజిస్ట్రేషన్​ నంబర్ ప్లేట్ సంఖ్య అక్షరాల కోటి రూపాయలకు పైగా పలికింది. తాను కొత్తగా కొన్న స్కూటీ కోసం ఓ ఫ్యాన్సీ సంఖ్యను దక్కించుకునేందుకు భారీ మొత్తంలో రవాణా శాఖకు సమర్పించుకునేందుకు సిద్ధమయ్యాడు హిమాచల్ ప్రదేశ్ ​శిమ్లాకు చెందిన ఓ వాహనదారుడు. మరో 26 మంది సైతం ఆ సంఖ్యను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. శిమ్లా కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ వేలంలో అత్యధిక ధరకు బిడ్ వేశాడు.

HP999999@రూ.కోటి 11 వేలు..
కోట్‌ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ ఔత్సాహికుడు HP999999 ఫ్యాన్సీ నంబర్​కు ఏకంగా రూ.కోటి 11 వేలు బిడ్డింగ్ వేశాడు. ఈ వీవీఐపీ(HP999999)నంబర్​ కోసం 26 మంది ఆసక్తి చూపి వేలంలో పాల్గొన్నారు. అయితే ఏకంగా రూ.కోటి 11 వేలకు దీనిని సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు ఓ వ్యక్తి. వాస్తవానికి దీని రిజర్వ్ ధర రూ.1000గా ఫిక్స్​ చేశారు అధికారులు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు వేలానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు అధికారులు. అనంతరం, ఈ నంబర్లను అధిక ధర కోట్ చేసిన వ్యక్తులకు కేటాయించనున్నారు. ఈ వీఐపీ నంబర్ల జాబితాలో ఇంకా చాలా సంఖ్యలు ఉన్నాయి. HP990009(రూ.21లక్షలు), HP990005(రూ.20లక్షలు), HP990003(రూ.10 లక్షలు) వంటి నంబర్లు వేలంలో ఉన్నా... అందరి దృష్టి మాత్రం HP999999 సంఖ్య మీదే పడింది.

స్కూటీకి 'లక్ష'.. నంబర్​కేమో 'కోటి'..
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నంబర్​ను దక్కించుకున్న వ్యక్తి రూ.లక్ష పెట్టి స్కూటీని కొనుగోలు చేస్తే.. దాని రిజిస్ట్రేషన్ నంబర్​ కోసం మాత్రం ఏకంగా రూ.కోటికి పైనే బిడ్డింగ్ చేయడం. సాధారణంగా రూ.కోట్లు విలువ చేసే కార్ల కోసం ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లను పొందుతారు కొందరు. కానీ, స్కూటీ కోసం ఇంత మొత్తంలో బిడ్డింగ్ వేయడాన్ని చూసి అధికారులే షాక్ అవుతున్నారు.

ఫ్యాన్సీ నంబర్లంటే..?
రవాణా శాఖ వీఐపీ నంబర్లంటూ అనేక సంఖ్యల సీరీస్​లను అమ్మకానికి ఉంచుతుంది. వీటినే ఫ్యాన్సీ, వీఐపీ, వీవీఐపీ నంబర్లు అంటారు. వీటిపై ఆసక్తి ఉన్నవారు అధికారులు నిర్దేశించిన రుసుమును చెల్లించి మనకు నచ్చిన నంబర్​ను పొందవచ్చు. కానీ, కొన్ని సందర్భాలలో ఒకే సంఖ్య కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. అటువంటి సమయాల్లో ఆఫీసర్లు బిడ్డింగ్​(వేలం) ప్రక్రియను చేపడతారు. ఇందులో పాల్గొన్న వారు ఎంత ఖర్చు చేసైనా సరే చివరకు వారికి నచ్చిన రిజిస్ట్రేషన్​ నంబర్​ను దక్కించుకుంటారు. ఇది రవాణా శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

ఇక గతేడాది ఏప్రిల్​లో హరియాణా ఛండీగఢ్​కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే తరహాలో భారీ మొత్తాన్ని చెల్లించి తన స్కూటీ నంబర్​ ప్లేట్​ కోసం లక్షల సొమ్మును సమర్పించుకున్నాడు. రూ.71,000 విలువ గల ఓ రిజిస్ట్రేషన్​ నంబర్​ను ఏకంగా రూ.15.44 లక్షలు చెల్లించి కోరుకున్న సంఖ్యను సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.