కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ఓ బైకర్ 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీంతో అతడికి ట్రాఫిక్ పోలీసులు రూ.16 వేలు జరిమానా విధించారు. ఈ జరిమానాను బైక్ యజమాని వీరేశ్ చెల్లించాడు.
ఇదీ జరిగింది..
దావణగెరెకు చెందిన వీరేశ్ 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. అందులో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు 23 కేసులు, బైక్ నడుపుతూ ఫోన్లో మాట్లాడినందుకు 3 కేసులు నమోదయ్యాయి. ఇలా వీరేశ్ ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించి బైక్ నడపడం స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జరిమానా కట్టమని నోటీసులు పంపారు. అయినా వాహన యజమాని వీరేశ్ ఇవేమి పట్టించుకోలేదు. సోమవారం పోలీసులకు వీరేశ్ పట్టుబడగా.. జరిమానా చెల్లించాలని కోరారు. దీంతో పెండింగ్లో ఉన్న మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించాడు.