ETV Bharat / bharat

రైతుల 'ఛలో దిల్లీ' మార్చ్​లో​ మరోసారి ఉద్రిక్తత - farmers march to delhi

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమం మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. దిల్లీ వైపు వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకోవడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

farmers
ఛలో దిల్లీ
author img

By

Published : Nov 27, 2020, 11:25 AM IST

Updated : Nov 27, 2020, 11:34 AM IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌-హరియాణా రైతులు చేపట్టిన 'ఛలో దిల్లీ' కార్యక్రమంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్లీ వైపు సాగుతున్న రైతులను సింఘు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

రైతులు దిల్లీలోకి వెళ్లకుండా సాయుధ పోలీసులు నిలువరించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

  • దిల్లీ-బహదుర్‌గఢ్‌ రహదారికి సమీపంలో టిక్రీ బోర్డర్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోన్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, బాష్పవాయువు‌ ప్రయోగించారు.
    • #WATCH Delhi: Police use water cannon & tear gas shells to disperse protesting farmers at Tikri border near Delhi-Bahadurgarh highway.

      Farmers are seen clashing with security forces, as they tried to head towards Delhi as part of their protest march against Centre's Farm laws. pic.twitter.com/L67PN4xYKy

      — ANI (@ANI) November 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ సభ్యులు నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను ట్రాక్టర్‌లో నింపుకొని దిల్లీకి బయలుదేరారు.
  • ఛలో దిల్లీ కార్యక్రమానికి వస్తున్న రైతులను పానిపత్ సమీపంలో జాతీయ రహదారి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు.
    • #WATCH: Plumes of smoke seen as security personnel use tear gas to disperse farmers protesting at Singhu border (Haryana-Delhi border).

      Farmers are headed to Delhi as part of their protest march against Centre's Farm laws. pic.twitter.com/eX0HBmsGhL

జైళ్లుగా మైదానాలు..!

రైతుల మార్చ్​ నేపథ్యంలో నగరంలోని పది స్టేడియాలను జైళ్లుగా వాడుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దిల్లీ పోలీసులు కోరినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: రైతుల 'ఛలో దిల్లీ' ఆందోళనలు ఉద్రిక్తం

Last Updated : Nov 27, 2020, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.