Omicron New: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. వారం రోజుల్లో 300 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దాటిందని స్పష్టం చేసింది. ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దని కోరింది. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపింది.
Corona Positivity Rate: మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్, దిల్లీ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, గుజరాత్లో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. డిసెంబర్ 30న 1.1 శాతం ఉన్న పాజిటివిటీ రేటు బుధవారం 11.05 శాతానికి చేరిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న.. రికార్డ్ స్థాయిలో 31.59లక్షల కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
ఆక్సిజన్ నిల్వలపై అలర్ట్:
Oxygen Stocks India: కొవిడ్ కేసుల పెరుగుదలతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్‌ను పునరుద్ధరించాలని నిర్దేశించింది. ఆక్సిజన్ నిల్వలను కనీసం 48గంటల బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సూచించింది. ఆక్సిజన్ థెరపీకి ప్రైవేటు ఆస్పత్రుల సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది.
ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 1.95 లక్షల మందికి వైరస్