జగన్నాథ స్వామిపై భక్తిని తన కళ ద్వారా వ్యక్తపరుస్తున్నారు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సూక్ష్మ కళాకారిణి ప్రియాంకా సాహ్నీ. చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, ఆకులు, బిస్కెట్లు సహా పలు వస్తువులపై సూక్ష్మరూపంలో 108 చిత్రాలను గీశారు ప్రియాంక. వాటిల్లో పూరీ జగన్నాథుని చిత్రాలతో పాటు అతని సోదరసోదరీమణుల కళాకృతులను రూపొందించారు. సోమవారం.. స్వామివారికి రథయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కళాకృతులను ప్రియాంక చిత్రించారు.
![paintings of Lord Jagannath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12421946_1.jpg)
![paintings of Lord Jagannath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12421946_3-2.jpg)
![paintings of Lord Jagannath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12421946_4.jpg)
![paintings of Lord Jagannath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12421946_3-1.jpg)
"కేక్ స్టాండ్స్, జాక్‌ఫ్రూట్, నారింజా, ఓరియో బిస్కెట్లు సహా పలు వస్తువులపై స్వామివారి చిత్రాలు వేశాను. అది చాలా కష్టమైన పని. అందుకు చాలా శ్రమించాను" అని ప్రియాంక వివరించారు.
భారీ సైకత శిల్పం
పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక శిల్పాన్ని నిర్మించారు. పూరీ బీచ్‌లో దాదాపు 43.2 అడుగుల పోడపు, 35 అడుగుల వెడల్పుతో జగన్నాథ స్వామి ఆలయాన్ని రూపుదిద్దారు. సైకత శిల్పంలో స్వామివారిని సహజమైన రంగులతో అద్దిన సుదర్శన్ పట్నాయక్.. ఆలయ గోపురాన్ని అందంగా తీర్చిదిద్దారు.
ఇదీ చూడండి: జులై 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం