ETV Bharat / bharat

కుర్రాడి స్మార్ట్​ ఐడియా.. అలెక్సా మాదిరిగా 'స్మార్ట్ మిర్రర్' - కటక్ న్యూస్

ఇంట్లో ఉన్న చోటే స్మార్ట్​ పనులు చేసే అసిస్టెంట్​ను తయారు చేశాడు ఒడిశా కటక్​కు చెందిన ఓ ఇంజినీరింగ్ కుర్రాడు. అలెక్సా.. మాదిరిగా పనిచేసే 'స్మార్ట్​ మిర్రర్' చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

smart mirror
స్మార్ట్ మిర్రర్
author img

By

Published : Sep 20, 2021, 9:03 AM IST

స్మార్ట్ మిర్రర్ చేసిన ఒడిశా కుర్రాడు

అలెక్సా.. ప్రస్తుతం ఈ పేరు తెలియనివారుండరు. ఇంట్లో కూర్చున్న దగ్గరే మనకోసం అన్ని స్మార్ట్​ పనులు చేసిపెట్టే అసిస్టెంట్ ఇది. అయితే.. ఇలాంటి అసిస్టెంట్​నే విభిన్నంగా తయారు చేశాడు ఒడిశా కటక్​కు చెందిన ఓ ఇంజినీరింగ్ కుర్రాడు. భువనానంద ఒడిశా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్​కు చెందిన స్వాధిన్ దాస్.. వాయిస్​తో పనిచేసే 'స్మార్ట్​ మిర్రర్​' తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ప్రతిభకు సాటిలేదని నిరూపించుకున్నాడు.

smart mirror
'స్మార్ట్​ మిర్రర్' తయారు చేసిన స్వాధిన్

ఎల్​ఈడీ మానిటర్, రాస్ప్​బెర్రీ పీఐ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ మొదలైన హార్డ్​వేర్​ టెక్నాలజీతో కూడిన టూవే మిర్రర్​ను ఉపయోగించి ఈ 'స్మార్ట్ మిర్రర్' తయారు చేశాడు స్వాధిన్. దీని కోసం దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపాడు.

ఈ అసిస్టెంట్ సాయంతో ఎలక్ట్రిక్​ బల్బ్​లు, ఫ్యాన్​, ఏసీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపరేట్ చేయవచ్చు. అలెక్సా మాదిరిగానే ఇది మ్యూజిక్​ వినిపిస్తుంది, న్యూస్​ కూడా చదువుతుండటం విశేషం.

అయితే.. కరోనా కారణంగా దీని తయారీకి సంబంధించిన వస్తువులు సులభంగా దొరకలేదని స్వాధిన్ అన్నాడు. నాలుగు నెలలు శ్రమించి.. ఈ స్మార్ట్​ మిర్రర్ తయారు చేసినట్లు వెల్లడించాడు. వృద్ధులకు, దివ్యాంగులకు.. తాను చేసిన యంత్రం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. తమ కళాశాలలో చదువుతూనే ఇలాంటి యంత్రం స్వాధిన్ తయారు చేయడంపై భువనానంద కాలేజీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:4 గుంటల స్థలంలో 265 వరి రకాలు.. ఎలా సాధ్యం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.