కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు '#స్పీక్అప్టుసేవ్లైవ్స్'(ప్రాణాలను కాపాడేందుకు గళం విప్పండి) పేరిట కాంగ్రెస్ పార్టీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ప్రతిఒక్కరు తోచిన విధంగా సాయపడాలని పిలుపునిచ్చారు.
-
Our country needs a helping hand in these distressing times. Let’s all do our bit to save lives.
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Join the campaign #SpeakUpToSaveLives and strengthen our fight against Corona. pic.twitter.com/g9aVINXO9p
">Our country needs a helping hand in these distressing times. Let’s all do our bit to save lives.
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021
Join the campaign #SpeakUpToSaveLives and strengthen our fight against Corona. pic.twitter.com/g9aVINXO9pOur country needs a helping hand in these distressing times. Let’s all do our bit to save lives.
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021
Join the campaign #SpeakUpToSaveLives and strengthen our fight against Corona. pic.twitter.com/g9aVINXO9p
దేశంలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలకు కొరత ఏర్పడిందని, టీకాలూ అందుబాటులో లేవని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ సహా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన సలహాలను సైతం మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని విమర్శించింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరా నిరంతరం కొనసాగడం సహా ప్రతి పౌరుడికీ టీకాను ఉచితంగా అందించాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో దేశంలోని సాధారణ ప్రజల కోసం ప్రతి ఒక్కరూ తమ గళాన్ని విప్పాలని కోరింది. ప్రస్తుత సమస్యలపై సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి: కేరళ మాజీ మంత్రి కేఆర్ గౌరీ అమ్మ మృతి