ETV Bharat / bharat

ప్రభుత్వ సంస్థలో అదిరే ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.90వేలు.. అప్లై చేయండిలా... - ఉద్యోగ నోటిఫికేషన్లు

NTPC notification 2022: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకో చక్కని అవకాశం. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూ.90 వేల వేతనం లభించనుంది.

NTPC NOTIFICATION
NTPC NOTIFICATION
author img

By

Published : Apr 4, 2022, 11:20 AM IST

NTPC notification 2022: ఉద్యోగార్థులకు శుభవార్త! నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్​టీపీసీ) నుంచి కీలక నోటిఫికేషన్ విడుదలైంది. 55 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది ఎన్​టీపీసీ. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్-ఓ అండ్ ఎం, ఆపరేషన్స్ పవర్ ట్రేడింగ్, బీడీ పవర్ ట్రేడింగ్ శాఖలలో ఈ 55 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భారీగా జీతం లభించనుంది.

• దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 8 2022
• నోటిఫికేషన్ తేదీ: ఏప్రిల్ 1, 2022
• విద్యార్హతలు: ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ పట్టా ఉండాలి. కనీసం 60శాతం మార్కులు వచ్చి ఉండాలి.
• వయసు 35ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ఇలా..
NTPC online apply: ఎన్​టీపీసీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లాలి. ఓపెనింగ్స్ సెక్షన్​ను ఎంచుకోవాలి.
• careers.ntpc.co.in పేరుతో వెబ్​సైట్ ఉంటుంది. ఇందులోనే దరఖాస్తును సమర్పించాలి.
• వెబ్​సైట్​లోని జాబ్స్ సెక్షన్​పై క్లిక్ చేయాలి. అనంతరం మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ అప్లై మీద నొక్కితే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది.
• ఏ జాబ్​కు అప్లై చేస్తున్నారో ఎంచుకొని దరఖాస్తు ప్రారంభించాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.90 వేల వేతనం చెల్లిస్తారు. దీనికి అదనంగా సంస్థ తరఫున ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది. ఉద్యోగితో పాటు భాగస్వామి, ఇద్దరు పిల్లలకు వైద్య సేవలు అందిస్తారు.

ఇదీ చదవండి: ఆర్మీ సరికొత్త పథకం.. సేద్యంలోకి 'కొత్త' సైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.