ETV Bharat / bharat

'బాంబు పేలుడు ఘటనతో షాక్ అవ్వలేదు' - ఇజ్రాయెల్ రాయబారి

దిల్లీ పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ రాయబారి రాన్​ మల్కా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఉగ్రదాడి అనటానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనతో షాక్​కు గురికాలేదన్నారు. తమ కార్యాలయంపై దాడి జరగబోతోందని తమకు అంతకుముందే నిఘా వర్గాలు సమాచారం అందించాయన్నారు.

Not surprised at 'evil attack' as we were on higher alert for few weeks: Israeli envoy
దిల్లీ బాంబు ఘటనతో షాక్ అవ్వలేదు: ఇజ్రాయెల్ రాయబారి
author img

By

Published : Jan 30, 2021, 8:17 PM IST

దిల్లీలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించిన ఒక రోజు అనంతరం ఆ దేశ రాయబారి రాన్​ మల్కా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో షాక్​కు గురికాలేదని, ఈ దాడికి సంబంధించి నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయన్నారు. ఇది ఉగ్రవాదుల దాడి అని తేల్చేందుకు అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ దర్యాప్తు అన్ని కోణాల్లో జరుగుతోందన్నారు మల్కా. 2012లో ఇజ్రాయెల్​ దౌత్య అధికారులపై జరిగిన దాడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నామని తెలిపారు.

"ఇలాంటి ఘటనలతో పశ్చిమాసియాలోని దేశాలతో మాకున్న సత్సంబంధాలను అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నారు. అయినా శాంతి నెలకొల్పే ప్రయత్నం మాత్రం ఆగదు. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా భారత ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. ప్రతి సమాచారాన్ని వారికి అందిస్తాం."

--రాన్​ మల్కా , ఇజ్రాయెల్​ రాయబారి.

దిల్లీ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే లుటెన్స్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి దగ్గరలో బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో దుండగులు ఐఈడీని ఉపయోగించారని పోలీసులు ప్రకటించారు. తక్కువ తీవ్రత కలిగిన ఈ బాంబు ధాటికి సమీపంలోని కొన్ని కార్లు దెబ్బతిన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి : ఇజ్రాయెల్​ ఎంబసీ వద్ద 'ఎన్​ఎస్​జీ' తనిఖీలు

For All Latest Updates

TAGGED:

ron malka
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.