ETV Bharat / bharat

నాయకత్వ మార్పుపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Jul 17, 2021, 12:37 PM IST

నాయకత్వ మార్పుపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

yediyurappa in delhi
యడియూరప్ప దిల్లీ పర్యటన

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాల నేపథ్యంలో దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజీనామాపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. దిల్లీ పర్యటనలో భాగంగా.. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు.

శనివారం ఉదయం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశం అనంతరం బయటకు వచ్చిన యడియూరప్ప.. రాజీనామా చేయడం లేదని తెలిపారు. కర్ణాటకలో చేపట్టిన మేకెదాటు సాగు నీటి ప్రాజెక్టు అనుమతి కోసం దిల్లీ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమైనట్లు చెప్పారు.

"రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్ని పుకార్లే. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాను. కర్ణాటక అభివృద్ధి గురించి వివరంగా చర్చించాము. వచ్చే నెలలో మరోసారి దిల్లీ వస్తా."

యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

ఇదీ చూడండి: 'హై కమాండ్​ చెబితే సీఎంగా తప్పుకుంటా'

ఇదీ చూడండి: యడియూరప్ప దిల్లీ పర్యటన.. నాయకత్వ మార్పుకు సూచన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.