అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ సర్కారుపై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎలాంటి బెదిరింపులకు భయపడబోయేది లేదన్నారు మమత. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన దీదీ.. తాము ఓడిపోవటం నేర్చుకోలేదని, ఎవరూ తమను ఓడించలేరని వ్యాఖ్యానించారు.
తనను బెదిరించడానికి ప్రయత్నించొద్దన్నారు మమత. 'తాను ఎవరికీ భయపడనన్న దీదీ.. దెబ్బతీయడం అంత సులభం కాదు' అని వ్యాఖ్యానించారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్యకు సీబీఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మమత.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
"నా జీవిత కాలంలో ఎలాంటి బెదిరింపులకు భయపడను. జైల్లో పెడతామని బెదిరించడానికి ప్రయత్నించొద్దు. అల్లర్లకు బెదిరిపోం. పోరాడటానికి వెనకాడం. 2021లో ఒకే ఆట మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లోనే నేనే గోల్‌కీపర్. ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడుతారో చూస్తా."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
బంగాలీలను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. "బంగాలీల వెన్నెముకను ఎవరైనా ఎలా దెబ్బతీయగలరో నేనూ చూస్తాను" అని ఆమె హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'వీరసైనికుల త్యాగాలనే అవమానిస్తారా?'