ETV Bharat / bharat

భాజపా ఎంపీ సహా 9మందిపై నాన్​బెయిలబుల్​ వారెంట్లు

2015 నాటి ఓ కేసులో భాజపా ఎంపీ రీటా బహుగుణ, కాంగ్రెస్​ నేత రాజ్​బబ్బర్​ సహా 9మందిపై నాన్​బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది లఖ్​నవూలోని ప్రత్యేక కోర్టు. కేసు విచారణకు వీరంతా న్యాయస్థానం ఎదుట హాజరుకానందుకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

non-bailable-warrants-against-9-accused-including-rita-bahuguna-joshi-and-rajabbar
భాజపా ఎంపీ సహా 9మందిపై నాన్​బెయిలబుల్​ వారెంట్లు
author img

By

Published : Nov 20, 2020, 12:24 PM IST

భాజపా ఎంపీ రీటా బహుగుణ జోషి, కాంగ్రెస్​ నేతలు రాజ్​బబ్బర్, ప్రదీప్​ జైన్ ఆదిత్యతో పాటు మరో ఆరుగురిపై నాన్​బెయిలబుల్​ వారెంట్లు జారీ చేసింది ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు. ​2015నాటి ఓ కేసు విచారణకు వీరంతా న్యాయస్థానం ఎదుట హాజరుకానుందుకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నిందితులపై ఇప్పటివరకు వారెంట్లు ఎందుకు జారీ చేయలేదని హజ్రత్​గంజ్​ పోలీస్​ స్టేషన్ హౌస్​ ఆఫీసర్​(ఎస్​హెచ్​వోకు)కు సమన్లు పంపింది.

2015నాటి కేసు...

2015, ఆగస్టు 17న లక్ష్మణ్ మేళా వద్ధ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అయితే అకస్మాతుగా ధర్నాలో కూర్చున్న నాయకులు, 5వేల మంది కార్యకర్తలు విధాన భవన్​ వద్దకు వెళ్లి గుమిగూడారు. వీరిని అక్కడ గుమిగూడకుండా ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లురువ్వారు. ఫలితంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడీఎం, ఎస్పీ, సీవో, ఎస్​హెచ్​వో స్థాయి అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అశోక మార్గ్​ నుంచి వెళ్లే సాధారణ పౌరులకు కూడా గాయాలయ్యాయి.

అనంతరం ఈ ఘటనపై హజ్రత్​గంజ్ పోలీస్ స్టేషన్​లో అధికారులు కేసు నమోదు చేశారు. 19మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆ కేసులో నిందితురాలుగా ఉన్న ప్రస్తుత భాజపా ఎంపీ రీటా బహుగుణ అప్పట్లో కాంగ్రెస్​లో ఉన్నారు.

ఇదీ చూడండి: దిల్లీని వీడనున్న సోనియా గాంధీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.