కేరళలో ముగ్గురు ఎన్డీఏ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం. కన్నూర్ జిల్లా తలసేరి, త్రిస్సూర్‌లోని గురువాయూర్, ఇడుక్కిలోని దేవీకుళం నియోజకవర్గాల్లో సంబంధిత పోలింగ్ అధికారులు వీటిని తిరస్కరించారు.
తలసేరిలో ఎన్.హరిదాస్ సమర్పించిన నామినేషన్ పత్రంలో భాజపా జాతీయ అధ్యక్షుడి సంతకం లేదనే కారణంతో నిరాకరణకు గురైంది. గురువాయూర్‌లో భాజపా అభ్యర్థి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నివేదిత; దేవీకుళంలో ఏఐఏడీఎంకే(ఎన్డీఏ) తరఫున బరిలోకి దిగిన ధనలక్ష్మిల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. కారణాలు తెలియరాలేదు.
అయితే.. భాజపా, కాంగ్రెస్‌ల రహస్య ఒప్పందంతోనే ఇద్దరు భాజపా సీనియర్ నేతల నామినేషన్లను తిరస్కరించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఏ.విజయ రాఘవన్ ఆరోపించారు. సీపీఎం, భాజపాల పరస్పర కుట్రతోనే.. నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని కేపీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ దీటుగా తిప్పికొట్టారు.
ఇదీ చదవండి: పుదుచ్చేరి బరి: యానాం సీటు వదిలి కాంగ్రెస్ త్యాగం!