కరోనా సృష్టిస్తున్న కల్లోలం మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు వాహనం కరవై.. చెత్తబండిలో తరలించాల్సి వచ్చింది. బాధిత కుటుంబానికి తీవ్ర క్షోభ మిగిల్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని ధులే జిల్లాలో జరిగింది.
షక్రి తాలుకా సమోద్ గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తి కరోనాతో శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్మశానానికి తరలించేందుకు తొలుత అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే ఎంతకీ రాలేదు. తర్వాత ఏదో ఒక వాహనం కోసం కుటుంబ సభ్యులు రోజంతా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయంలో పంచాయతీ కూడా చేతులెత్తేసింది. చివరికి ఊర్లో చెత్త తరలించే బండిలోనే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
ఇదీ చదవండి: కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..