ETV Bharat / bharat

'రెండేళ్లు సోషల్​ మీడియాకు దూరంగా ఉంటేనే బెయిల్'

యూపీ ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు సరికొత్త షరతు విధించింది అలహాబాద్ హైకోర్టు. నిందితుడు రెండేళ్ల పాటు సామాజిక మాధ్యమాలు వాడకూడదని ఆదేశించింది.

No social media for 2 yrs: High court bail condition in UP
'రెండేళ్లు సోషల్​ మీడియా వాడొద్దంటూ యూపీ హైకోర్టు తీర్పు'
author img

By

Published : Nov 6, 2020, 11:26 AM IST

Updated : Nov 6, 2020, 11:38 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో అలహాబాద్ హైకోర్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. నిందితుడు రెండేళ్లపాటు సోషల్​ మీడియాకు దూరంగా ఉండాలన్న షరతుతో బెయిల్​ మంజూరు చేసింది.

ఇదీ కేసు..

సీఎం యోగి ఆదిత్యనాథ్​పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దేవరియాకు చెందిన అఖిలానంద రావు. ఈ కేసులో నిందితుడిపై ఇప్పటికే ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు కొత్వాలీ పోలీసులు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​-420(మోసం), 120బీ(కుట్ర); ఐటీ చట్టం సెక్షన్​-66డీ కింద ఈ ఏడాది మే 12న అభియోగాలు మోపారు.

నిందితుడు బెయిల్​కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఎలాంటి వాయిదాలు కోరకుండా దర్యాప్తు సంస్థలకు సహకరించాలని స్పష్టంచేసింది.

ఇదీ చదవండి: ఆ చిన్నారిని కాపాడేందుకు గ్రామంలో 144 సెక్షన్​

Last Updated : Nov 6, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.