ETV Bharat / bharat

ఇక నుంచి సార్‌, మేడమ్ వద్దు.. చేటన్‌, చేచి అంటే చాలు! - కేరళ న్యూస్ లేటెస్ట్​

అధికారులకు, ప్రజలు మధ్య ఉన్న దూరాన్ని తొలగించడానికి ఓ గ్రామం వినూత్న ఆలోచన చేసింది. మర్యాదపూర్వకంగా పిలిచే సార్‌, మేడమ్‌ లాంటి గౌరవ పదాలను గ్రామస్థులు వాడకుండా నిషేధించింది.

No more "Sir" or "Madam in this Kerala panchayat office as it bans honorifics
ఇక నుంచి సార్‌, మేడమ్ వద్దు.. చేటన్‌,చేచి అంటే చాలు!
author img

By

Published : Sep 3, 2021, 7:27 AM IST

Updated : Sep 3, 2021, 9:03 AM IST

గ్రామాల్లో కొంత మంది పంచాయతీ అధికారులతో మాట్లాడడానికే భయపడుతుంటారు. అధికారుల దగ్గరికి వెళ్లి వారికి ఉన్న సమస్యలను కూడా చెప్పుకోలేరు. అలాంటి వారు స్వేచ్ఛగా అధికారులతో మాట్లాడానికి కేరళలోని ఓ గ్రామం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. అధికారులకు, ప్రజలు మధ్య ఉన్న దూరాన్ని తొలగించడానికి వారిని మర్యాదపూర్వకంగా పిలిచే సార్‌, మేడమ్‌ లాంటి గౌరవ పదాలను గ్రామస్థులు వాడకుండా నిషేధించింది.

కేరళలోని మథురా అనే గ్రామంలోని సాధారణ ప్రజలు పంచాయతీ అధికారులను సార్‌, మేడమ్‌ అని సంబోధించాల్సిన అవసరం లేదని కొత్త రూల్‌ తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలోనే ఈ పదాలను తొలగించిన మొదటి గ్రామంగా మథురా నిలిచింది.

ఎందుకు నిషేధించారంటే..?

సార్‌, మేడమ్‌ అనే పదాలు ప్రజలకు, అధికారులకు మధ్య దూరాన్ని పెంచుతున్నాయని..దాన్ని చెరిపేసి స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మథురా గ్రామ పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకం ప్రజలేనని.. వాళ్లు ఎన్నుకునే నేతలు వారి సేవకులని పేర్కొన్నారు. వారు అధికారులకు మర్యాద ఇవ్వాల్సిన పని లేదన్నారు. అధికారులను సేవ చేయాలని అభ్యర్థించకుండా ప్రజలు డిమాండ్‌ చేయాలన్నారు.

గౌరవ పదాలను నిషేధించిన తర్వాత పంచాయతీ బయట నోటీసులను కూడా అంటించారు. సార్‌, మేడమ్‌ అని సంబోధించకపోయినా అధికారులు ప్రజల సమస్యలు తీరుస్తారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే వారిపై పంచాయతీ ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే ప్రతి ఒక్క అధికారి టేబుల్‌ దగ్గర వారి పేర్లతో కూడిన బోర్డును కూడా పెట్టారు. అంతేకాకుండా ‘అపేక్ష(అప్లికేషన్‌) ఫామ్‌’కు బదులుగా ‘అవకాశ పత్రిక’ను తీసుకువస్తామని పంచాయతీ అధికారులు తెలిపారు. అపేక్ష అంటే రిక్వెస్ట్‌ అనే అర్థం వస్తుందని అందుకే దీన్ని మారుస్తున్నామని స్పష్టం చేశారు. మేడమ్‌, సార్‌కు బదులుగా చేటన్‌ (అన్న) చేచి (అక్కా) అని అధికారులను పిలవవచ్చు అని పంచాయతీ పేర్కొంది.

ఇదీ చదవండి: Covid Vaccine: ఆస్పత్రి ముప్పు తగ్గించడంలో.. టీకాల పనితీరు భేష్‌!

Last Updated : Sep 3, 2021, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.