దేశంలో కరోనా రక్కసి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తాజాగా కేంద్రం స్పందిస్తూ వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ చేసి స్పష్టతనిచ్చింది.
-
सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021
లాక్డౌన్ చివరి అస్త్రమే..
"మే 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. కానీ, నిజమేంటంటే.. ఆ పోస్టులు పూర్తిగా అవాస్తవం. కేంద ప్రభుత్వం అలాంటి ప్రకటనేమీ చేయలేదు" అని పీఐబీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్ చివరి అంశం కావాలి అన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్‌మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. మే 3 నుంచి లాక్‌డౌన్ పెట్టనున్నారని ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసినట్లుగా ఉన్న పోస్టులు ఇటీవల వైరల్ అయ్యాయి. అయితే తాము అలాంటి వార్తలేమీ ప్రసారం చేయలేదని సదరు టీవీ ఛానల్ పేర్కొంది.
లాక్‌డౌన్ అవసరం ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. గత గురువారం కేంద్ర హోంశాఖ స్పందిస్తూ.. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మే 31 వరకు కరోనా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: లాక్డౌన్ ఎఫెక్ట్: నిండు గర్భిణి 115 కి.మీ. నడక