ETV Bharat / bharat

మోదీని కలిసిన నితీశ్​.. సాగు చట్టాలకు మద్దతు - farmers protest

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్..​ ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యారు. సాగు చట్టాలకు మద్దతు తెలిపారు. ఈ చట్టాలు రైతుల మేలు కోసమే కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు.

modi, nitish, farm laws
మోదీ కలిసిన నితీశ్​.. సాగు చట్టాలకు మద్దతు
author img

By

Published : Feb 11, 2021, 7:26 PM IST

Updated : Feb 11, 2021, 7:34 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతు తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాలు రైతుల మేలు కోసమేనని అన్నారు. కర్షకులకు ఇవి వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం జరిగిన భేటీ అనంతరం.. ఈ విషయాలు తెలిపారు.

ప్రధానితో ప్రత్యేకించి ఎలాంటి డిమాండ్లను ప్రస్తావించలేదని.. వివిధ సమస్యలపై చర్చించామని నితీశ్​ వెల్లడించారు.

modi, nitish, farm laws
మోదీ-నితీశ్ భేటీ

చర్చలు సరైనవే..

చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులతో చర్చలు జరపడం ద్వారా కేంద్రం సరైన మార్గాన్ని ఎంచుకుందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తప్పులేదు..

'బిహార్​లో నితీశ్​ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు' అని వస్తున్న ఆరోపణలపై స్పందించిన సీఎం.. ఈ ఆరోపణలతో వారికి ప్రచారం లభిస్తుంది అనుకుంటే అందులో ఎలాంటి తప్పులేదన్నారు. ఈ నేతలంతా వాస్తవాలకు దూరంగా ఉండే వారంటూ విమర్శించారు. బిహార్​లో గతేడాది ప్రభుత్వం ఏర్పడ్డాక మోదీని నితీశ్ కలవడం ఇదే తొలిసారి. ​

ఇదీ చదవండి : 'ధనికుల కోసం, ధనికుల చేత, ధనికుల బడ్జెట్'

Last Updated : Feb 11, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.