Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వేరియంట్ కలకలం నేపథ్యంలో ముంబయిలో రాత్రి వేళల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్‌లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని నిబంధనలు..
- వివాహ కార్యక్రమాల్లో 50 మందికి మించరాదు.
- సామాజిక, మతపరమైన, రాజకీయ సభల్లో కూడా 50 మంది కంటే ఎక్కువ హాజరుకావద్దు.
- అంతిమ సంస్కారాల్లో 20 మందికన్నా ఎక్కువ పాల్గొనకూడదు.
- ఈ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు.
Mumbai Curfew Rules: ముంబయిలో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగాయి. దానికి తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. గురువారం 46,337 కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,555 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కరోనా కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. ఏ కార్యక్రమాల్లోనైనా 50 మందికి మించరాదని ఆంక్షలు విధించింది. ఇంతకుముందు ఇండోర్‌లో 100 మంది.. బహిరంగ ప్రదేశాల్లో 250 మంది హాజరు కావొచ్చనే నిబంధనలు ఉండేవి.
ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 16వేల మందికి వైరస్