ETV Bharat / bharat

ఐసిస్​ 'ఉగ్ర' నియామకం- రంగంలోకి ఎన్​ఐఏ - జమ్ముకశ్మీర్​లో ఎన్​ఐఏ తనిఖీలు

జమ్ముకశ్మీర్​లోని ఉగ్రవాదులు, ఐసిస్​ స్థావరాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విస్తృత సోదాలు నిర్వహించింది. ఐసిస్ ఉగ్రవాద నియామకం చేపట్టిందని సమాచారం అందగా ఈ చర్యలు చేపట్టింది. తనిఖీల్లో పెద్దఎత్తున మొబైల్ ఫోన్లు, డిజిటల్​ పరికరాలను స్వాధీనం చేసుకుంది.

nia searches in jammu kashmir
pజమ్ముకశ్మీర్​లో ఎన్​ఐఏ సోదాలు
author img

By

Published : Jul 11, 2021, 6:59 PM IST

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​, అనంత్​నాగ్​ సహ ఏడు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ఆదివారం విస్తృత సోదాలు నిర్వహించింది. ఉగ్రవాద, ఐసిస్​ స్థావరాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. భారత్​లో జిహాద్ కార్యకలాపాలు నిర్వహించే కుట్రలో భాగంగా.. ఐసిస్​ ఉగ్రవాద నియామకం చేపట్టిందన్న ఆరోపణలతో జూన్​ 29న కేసు నమోదైందని ఎన్​ఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. 'వాయిస్ ఆఫ్​ హింద్' ప్రచురించిన​ ఓ కథనం ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, మొబైల్​ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్​టాప్​లు, హార్డ్​ డిస్క్​లు, ఐసిస్​ లోగోతో ఉన్న టీ-షర్టులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: ఎన్​కౌంటర్​లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం

ఇదీ చూడండి: 11 మంది సర్కారీ ఉద్యోగులపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.