కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహమ్మద్ మన్సూర్ పీ.హెచ్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. దుబాయ్ నుంచి వచ్చిన మన్సూర్‌ను ఎన్‌ఐఏ అధికారులు కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
యూఏఐలో ఉన్నప్పుడు మహమ్మద్ మన్సూర్‌పై ఎన్‌ఐఏ చార్జిషీట్ ఫైల్ చేసింది. ఎర్నాకుళంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మన్సూర్‌పై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను జారీ చేసింది. కొచ్చిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అధికారులు అతన్ని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.
కేరళలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దౌత్య కార్యాలయానికి చెందిన పార్శిల్‌లో రూ. 14.82 కోట్ల విలువైన 30 కేజీల బంగారాన్ని.. 2020 జులై 5న విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఐఏ జులై10న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో 20 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది. దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్స్ విక్రయం!