దిల్లీలోని సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తోన్న రైతుల కోసం.. రెండు పడకల తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని లైఫ్ కేర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్ణయించింది. మరో రెండు రోజుల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. వర్షం వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టెంట్లు వేసి దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
నిరసన చేస్తోన్న రైతులకు సేవ చేయాలనే లక్ష్యంగా.. 24 గంటల సౌకర్యంతో నవంబరు 30 నుంచి ఈ సంస్థ అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్న తరుణంలో గుండె సంబంధిత బాధితులు పెరుగుతుండగా.. వారికోసం బుధవారం నుంచి ఈసీజీ సౌకర్యాన్నీ ప్రారంభించనుంది.
ఇదీ చదవండి: 'జనవరి 7న దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ర్యాలీ'