ETV Bharat / bharat

Newborns Die Of Cold : ఏసీ వేసుకుని హాయిగా నిద్రపోయిన డాక్టర్​.. చలికి ఇద్దరు నవజాత శిశువులు మృతి! - గర్ల్​ఫ్రెండ్​తో గొడవపడి ఆత్మహత్య

Newborns Die Of Cold : ఉత్తర్​ప్రదేశ్​.. శామలి జిల్లాలోని ఓ ఆసుపత్రిలో దారుణం జరిగింది. హాయిగా నిద్రపోవడానికి ఓ డాక్టర్​ ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువులు మరణించారు.

Newborns Die Of Cold
Newborns Die Of Cold
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 3:44 PM IST

Updated : Sep 25, 2023, 5:13 PM IST

Newborns Die Of Cold : ఓ వైద్యుడి నిర్లక్ష్యం ఇద్దరు నవజాత శిశువుల ప్రాణాలు బలితీసుకుంది. హాయిగా నిద్రపోవడానికి ఓ డాక్టర్​ ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు నవజాత శిశువులు మరణించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని శామలి జిల్లాలో ఆదివారం జరిగింది. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డాక్టర్​ నీతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైద్యారోగ్య శాఖ.. విచారణకు ఆదేశించింది. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీఎమ్​ఓ డాక్టర్ అశ్వణి శర్మ తెలిపారు.

ఇదీ జరిగింది
కైరాణా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్​కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ యూనిట్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్​ నీతు.. హాయిగా నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు వెళ్లేసరికి.. చనిపోయి కనిపించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్ నీతుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గర్ల్​ఫ్రెండ్​తో గొడవపడి ఆత్మహత్య
గర్ల్​ఫ్రెండ్​తో గొడవపడి మస్థాపానికి గురైన ఓ ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​.. లఖ్​నవూలోని ఓ ఎమ్మెల్యే అధికారిక నివాసంలో జరిగింది. బారాబంకికి చెందిన శ్రేష్ట తివారీ.. బక్షీ కా తలాబ్​ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా వద్ద సోషల్ మీడియా సెల్​లో పని చేస్తున్నాడు. అయితే, ఆదివారం రాత్రి ప్రియురాలితో అతడికి గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రేష్ట తివారీ.. ఆమెకు వీడియో కాల్​ చేసి ఉరివేసుకున్నాడు. ప్రియురాలు ఎంత చెప్పినా వినకపోవడం వల్ల.. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి చూసేసరికి అతడు మరణించాడు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసకున్న పోలీసులు.. పోస్టుమార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Youth Committed Suicide in MLAs Residence
ఎమ్మెల్యేతో శ్రేష్ట తివారీ
Youth Committed Suicide in MLAs Residence
శ్రేష్ట తివారీ (పాత చిత్రం)

Silicone Child Doll IIIT Delhi : లక్షలాది పిల్లల అనారోగ్య సమస్యలకు చెక్​.. 'సిలికాన్​' లూసీతో వైద్యులకు ట్రైనింగ్​

Madhya Pradesh Road Accident : చెట్టును కారు ఢీకొని.. ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి!.. మరో ఘటనలో ఇద్దరు..

Last Updated : Sep 25, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.