ETV Bharat / bharat

'యాసిడ్​' ఈగలతో ఆ రాష్ట్రం హడల్.. చర్మంపై వాలితే... - నైరోబీ ఫ్లై శిలిగుడి

Nairobi Fly Bengal: బంగాల్​లో 'నైరోబీ ఫ్లై' అనే కొత్త వ్యాధి వ్యాపిస్తోంది. ఆఫ్రికాకు చెందిన 'నైరోబీ ఫ్లై' లేదా 'యాసిడ్ ఫ్లై' అనే ఈగలు.. శిలిగుడి, డార్జిలింగ్ సహా పలు ప్రాంతాల ప్రజల చర్మంపై కాటు వేసి అస్వస్థతకు గురి చేస్తున్నాయి. దీంతో వందలాది మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అసలేంటి ఈ నైరోబీ ఫ్లై? కుడితే వచ్చే లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

్Acid Fly: New terror in North Bengal
్Acid Fly: New terror in North Bengal
author img

By

Published : Jul 6, 2022, 12:57 PM IST

Nairobi Fly Acid Fly Bengal: బంగాల్​లో గత కొద్ది రోజులుగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శిలిగుడి, డార్జిలింగ్​ సహా ఉత్తర బంగాల్​లోని పలు ప్రాంతాల్లో 'నైరోబీ ఫ్లై' అనే​ ఆఫ్రికన్​ ఈగలు.. ప్రజల చర్మంపై కుడితే అస్వస్థతకు గురిచేస్తున్నాయి. దాంతో అనేక మంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే వీటివల్ల అంత భయపడాల్సిన పని లేదని, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

Acid Fly: New terror in North Bengal
యాసిడ్​ ఫ్లై

ఆ పదార్థం వల్ల.. 'నైరోబీ ఫ్లై' లేదా 'యాసిడ్ ఫ్లై' అనేది ఒక ఆఫ్రికన్ ఈగ. నారింజ, ఎరుపు, నలుపు మూడు రంగుల్లో ఈ కీటకం ఉంటుంది. ముఖ్యంగా ఈ కీటక శరీరంలో పెడిటిన్ అనే ఆమ్ల పదార్థం​(యాసిడ్​) ఉంటుంది. ఇది మానవ చర్మానికి హాని కలిగిస్తుంది. ప్రధానంగా వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో ఈ ఈగలు సంచరిస్తాయి. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన అధిక వర్షపాతం కారణంగా అక్కడ తిరుగుతున్నాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం వర్షపాతం ఎక్కువగా నమోదవ్వడం వల్ల 'యాసిడ్ ఫ్లై'ల సంచారం అసాధారణ స్థాయిలో పెరిగింది. చెప్పాలంటే ఈ కీటకం.. చర్మంపై కుట్టదు. కానీ ఒంటిపై అవి వాలినప్పుడు వాటిని కొడితే మాత్రం రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఆ కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారే అవకాశం ఉంది.

Acid Fly: New terror in North Bengal
బాధితుల శరీరంపై 'నైరోబీ ఫ్లై' దాడి

అయితే ఈ పురుగు కుట్టిన ప్రదేశంలో విపరీతమైన మంట, తర్వాత తీవ్రంగా నొప్పి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. దీనివల్ల జ్వరం బారిన పడుతున్నామని, వాంతులు కూడా అవుతున్నాయని తెలిపారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా.. వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. వైద్యులు ఇచ్చిన సలహాలు పాటిస్తే 8-10 రోజుల్లో కోలుకోవచ్చని చెబుతున్నారు. రాత్రిపూట ఫుల్ స్లీవ్ షర్ట్, ప్యాంటు, దోమతెరలు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. శిలిగుడి మున్సిపాలిటీలోని ఆశ్రంపర, గురుంగ్​బస్తీ, చంపాసరి, మతిగర, దేశబంధుపరా సహా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ పురుగు కాటుకు గురయ్యారు.

ఇవీ చదవండి: భూవివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. గొడ్డలి, కర్రలతో దాడి

ఇళ్ల మధ్యలో చిరుత హల్​చల్.. స్థానికులు హడల్.. మత్తు మందు ఇచ్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.