ETV Bharat / bharat

బ్రిటన్​ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు - new coronavius news

కొత్త రకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్​ నుంచి వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు ఇప్పటికే రద్దు చేసింది కేంద్రం. ఇప్పుడు యూకే నుంచి, యూకే మీదుగా వచ్చిన ప్రయాణికులను కొత్త మార్గదర్శకాల పరిధిలోకి చేర్చింది.

New-SOP-For-UK-Arrivals
కొత్త రకం కరోనా: కేంద్రం మార్గదర్శకాలు
author img

By

Published : Dec 23, 2020, 4:51 AM IST

కరోనా వైరస్ ఇప్పటికే ఒకవైపు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే.. కొత్త రూపంలోకి మార్పు చెంది మరోసారి భయం గుప్పిట్లోకి నెట్టేసింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు రద్దు చేయగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం సరికొత్త మార్గదర్శకాలను వెలువరించింది. 'కరోనా వైరస్‌లో వెలుగుచూసిన ఉత్పరివర్తనాల ద్వారా ఈ వేరియంట్‌ను నిర్వచిస్తున్నారు. ఇది అంటువ్యాధిగా మారి, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది' అని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అందుకే, గత నాలుగు వారాల్లో (నవంబర్ 25 నుంచి డిసెంబర్‌23 వరకు) యూకే నుంచి, మీదుగా వచ్చిన ప్రయాణికులను ఈ కొత్త మార్గదర్శకాల పరిధిలోకి చేర్చామని తెలిపింది.

వాటి ప్రకారం..

  • ప్రయాణికులందరూ వారి గత 14 రోజుల ప్రయాణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని నింపాలి. ఆ వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ, పాజిటివ్ అని తేలితే..స్పైక్‌ జీన్‌కు సంబంధించిన ఆర్టీపీసీఆర్ పరీక్షకు సిఫార్సు చేస్తారు.
  • ఇప్పటికే ఉన్న కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలితే..లక్షణాల తీవ్రతను బట్టి హోం ఐసోలేషన్‌లో ఉంచడం కానీ, ఆసుపత్రులకు తరలించడం కానీ చేస్తారు.
  • ఒకవేళ కొత్త రకం వైరస్ పాజిటివ్‌గా తేలితే..బాధితుడికి ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. 14 రోజుల తరవాత మరోసారి పరీక్షలు జరుపుతారు. మరోసారి పాజిటివ్‌గా తేలితే 24 గంటల్లో రెండు సార్లు నెగిటివ్ వచ్చే వరకు నమూనాలను తీసుకొని పరీక్షించవచ్చు. అలాగే కొత్త రకం కరోనా వైరస్‌ పాజిటివ్ వ్యక్తితో ప్రయాణించిన వారిని సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచాలి.
  • చెక్‌ఇన్ సమయంలోనే ప్రయాణికులకు ఎస్‌ఓపీల గురించి వెల్లడించాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. అలాగే యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సంబంధిత రాష్ట్రాలు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్‌ సర్వైలెన్స్ ప్రొగ్రామ్‌కు అందించాలని తెలిపింది.

ఇదీ చూడండి: 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.