ETV Bharat / bharat

కొవిడ్ కొత్త రకం గంటలోపే పట్టేయొచ్చు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కొత్త స్ట్రెయిన్ కరోనా లక్షణాలు గుర్తించేందుకు కొత్త పరీక్ష విధానాన్ని రూపొందించింది కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్. ప్రస్తుతం స్ట్రెయిన్​ను గుర్తించే పరీక్షా ఫలితాలు 36 నుంచి 48 గంటల్లో వస్తుండగా.. కొత్త విధానంతో ఆ సమయం గంటకు తగ్గనుంది.

CSIR's Feluda team develops RAY
స్ట్రెయిన్ గుర్తింపునకు కొత్త రకం పరీక్ష
author img

By

Published : Feb 6, 2021, 5:44 AM IST

కరోనా వ్యాక్సిన్ తయారై అందుబాటులోకి వచ్చేసరికి వైరస్‌ రూపాంతరం చెందుతూ ప్రపంచాన్ని ఆందోళనలో ముంచేసింది. ముఖ్యంగా బ్రిటన్​లో వెలుగు చూసిన కరోనా స్ట్రెయిన్‌ 50శాతం ఎక్కువగా వ్యాపించే లక్షణాలను కలిగి ఉంది. దీంతో దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.

గంటలోపే ఫలితాలు..

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి కొత్త స్ట్రెయినా.. కాదా అని నిర్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి ఫలితాలు రావడానికి కనీసం 36 నుంచి 48 గంటల సమయం పడుతోంది. దీంతో ఈ ఇబ్బందులను తొలగించేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్) కొత్త కరోనా టెస్టును రూపొందించింది. ఈ టెస్టు ద్వారా కేవలం ఒక గంటలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి ఫలితాన్నందిస్తుందని పరిశోధక బృందం తెలిపింది. ఆ టెస్టుకు రాపిడ్‌ వేరియంట్‌ యస్సే(రే) అని పేరు పెట్టారు. ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే కు గౌరవసూచకంగా ఆయన పేరును పెట్టినట్లు వారు తెలిపారు.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేసి ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ఇప్పటికే జీనోమ్‌ కన్సార్టియంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విమానాశ్రయాల్లోనే వైరస్‌ జన్యు పరీక్షలు నిర్వహించేలా వీటిని రూపొందించారు. సీఎస్‌ఐఆర్‌ రూపొందించిన రే టెస్టును పేపర్‌ స్ట్రిప్‌ ద్వారా చేస్తారు. వీటిలో యూకే స్ట్రెయిన్‌ మాత్రమే కాకుండా కొత్తగా ఏవైనా స్ట్రెయిన్‌లు వచ్చినా గుర్తించొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వ్యవసాయశాఖ మంత్రిపై ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.