ETV Bharat / bharat

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు బోస్ అవార్డు

author img

By

Published : Jan 24, 2022, 5:49 AM IST

Netaji Award 2022: జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేకు అరుదైన గౌరవం దక్కింది. 'నేతాజీ అవార్డు 2022'ను షింజోకు ప్రధానం చేసింది నేతాజీ రీసెర్చ్ బ్యూరో.

shinzo abe
షింజో అబే

Netaji Award 2022: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేతాజీ రీసెర్చ్ బ్యూరో.. జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేను సత్కరించింది. 'నేతాజీ అవార్డు 2022'ను షింజోకు ప్రధానం చేసింది. ఈ మేరకు కోల్​కతాలోని ఎల్గిన్ రోడ్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో షింజోకు బదులుగా అవార్డును స్వీకరించారు జపాన్ కన్సుల్ జనరల్ నకమురా యుతాకా. ఈ అవార్డు పొందడంపై హర్షం వ్యక్తం చేసిన జపాన్ మాజీ ప్రధాని.. కన్సుల్ జనరల్​ ద్వారా తన సందేశం పంపారు.

"జపాన్ ప్రజాప్రతినిధిగా, మాజీ ప్రధానిగా.. భారత్​తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాను. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత పెరగాలని ఆశిస్తున్నా. రాజకీయ, ఆర్థిక, సంస్కృతిక అభివృద్ధి కోసం ఇరు దేశాలు పరస్పరం కృషి చేసుకోవాలి." అని మెసేజ్ ఇచ్చారు షింజో అబే.

ఈ కార్యక్రమంలో భాగంగా షింజో కూడా నేతాజీని ఆరాధిస్తారని.. సుభాష్​ చంద్రబోస్ మనవడు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో డైరెక్టర్ ప్రొఫెసర్ సుగాటా బోస్​ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంగాల్ సీఎం మమత బెనర్జీ హాజరయ్యారు. భారత్​లోని జపాన్ దౌత్యాధికారి సతోషి సుజుకి దిల్లీ నుంచి వర్చువల్​గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'నేతాజీ విగ్రహం.. భావితరాలకు స్ఫూర్తి'

'విగ్రహం సరే.. నేతాజీ మిస్టరీ సంగతేంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.