మృతదేహాల దహనం ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మహారాష్ట్రకు చెందిన నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) పరిష్కారాన్ని కనుగొంది. ఎలాంటి కాలుష్యం లేకుండా దహనం పూర్తయ్యే విధంగా 'గ్రీన్ క్రిమటోరియా' పేరుతో కొత్త సాంకేతికతను రూపొందించింది. ఈ గ్రీన్ క్రిమటోరియాను ఇప్పటికే దిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేశారు.
"సాధారణంగా ఓ శవం దహనం అయ్యే సమయంలో ఐదు కేజీల ధూళితో పాటు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విష వాయువులు ఉత్పత్తి అవుతాయి. కరోనా వేళ మరణాలు పెరగడం వల్ల ఈ కాలుష్యం పెరిగింది. దిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ క్రిమటోరియం ఇటీవల ప్రారంభమైంది. త్వరలో మరిన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. వీటి ద్వారా శ్మశానాల వద్ద ఉత్పత్తి అవుతున్న కాలుష్యం తగ్గుతుంది."
-ఎన్ఈఈఆర్ఐ
శాస్త్రవేత్త పద్మారావు నేతృత్వంలో గ్రీన్ క్రిమటోరియాపై ఎన్ఈఈఆర్ బృందం పరిశోధన చేపట్టింది.
ఇదీ చదవండి : కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ తొలగింపు!