స్వీయ నిగ్రహం పాటించడం, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించడం వల్ల ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని.. చైనానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. 7 నెలలుగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వర్చువల్‌గా జరిగిన ఆసియాన్ ఏడీఎమ్ఎమ్-ప్లస్(రక్షణమంత్రుల సమావేశం)లో పాల్గొన్నారు రాజ్‌నాథ్. పరస్పర సహకారంతో మెలిగే పరిస్థితులను కల్పించడంలో ఆసియాన్ దేశాల పాత్రను కొనియాడారు.
"పరస్పర నమ్మకాన్ని వృద్ధి చేందుతున్న క్రమంలో స్వీయ నిగ్రహంతో ఉండి, పరిస్థితులను మరింత క్లిష్టంగా చేసుకోవడాన్ని మానుకుంటే ప్రాంతాంలో శాంతిని కొనసాగించవచ్చు. అయితే సైబర్ నేరాలు, ఉగ్రవాదం, సముద్ర భద్రతతో పాటు మరికొన్ని సమస్యలు.. శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. ఆసియాన్ బృందంగా మనం ఈ సమస్యలను పరిష్కరించాలి."
-- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి.
ఈ సమావేశానికి హాజరైన వారిలో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘి కూడా ఉన్నారు. మొత్తం మీద 10 ఆసియాన్ దేశాలతో పాటు ఏడీఎమ్ఎమ్-ప్లస్‌లో ఆస్ట్రేలియా, చైనా, భారత్, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, అమెరికా కూడా ఉన్నాయి.
ఇదీ చూడండి:- ఏటీఎం దొంగతో సెక్యూరిటీ గార్డ్ పోరు