కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ను వీడి.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో చేరనున్నట్టు ప్రకటించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల.. ఐశ్వర్య కేరళ పేరుతో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర.. తన నియోజకవర్గమైన పాలాకు చేరినప్పుడు ఇందులో పాల్గొంటానని.. రాష్ట్రంలో ఎన్సీపీకి నేతృత్వం వహిస్తున్న ఎమ్మెల్యే మణి సీ కప్పెన్ వెల్లడించారు.
ఎల్డీఎఫ్ టికెట్ మీద 2019 ఉప ఎన్నికల్లో గెలిచిన కప్పెన్.. తనకు 7 జిల్లాల ఎన్సీపీ అధ్యక్షులు, 9 రాష్ట్రస్థాయి ఆఫీస్ బేరర్ల మద్దతు ఉందని ప్రకటించారు.
కప్పెన్ నిర్ణయానికి ఓ కారణమున్నట్టు తెలుస్తోంది. జాస్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్(ఎమ్).. యూడీఎఫ్‌తో ఉన్న 10ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎల్డీఎఫ్తో చేతులు కలిపింది. అనంతరం. పాలా నియోజకవర్గాన్ని ఆ పార్టీకి అందించే యోచనలో అధికార సీపీఐ(ఎమ్) ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్డీఎఫ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఎన్సీపీ నేత.
ఈ వ్యవహారంపై కేరళ రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ స్పందించారు. ఉపఎన్నికల్లో తనను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చూడండి:- కేరళలో 'బ్యాక్ డోర్' రాజకీయం- విజయన్‌కు కష్టమే!