NBCC recruitment 2022: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్బీసీసీ) మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జనరల్ మేనేజర్(ఇంజినీరింగ్), అడిషనల్ జనరల్ మేనేజర్(మార్కెటింగ్), ప్రాజెక్ట్ మేనేజర్(సివిల్) ఖాళీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో మొత్తం 23 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది ఎన్బీసీసీ.
జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్): ఈ కేటగిరీలో మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెలకు జీతం సుమారు రూ.90 వేల నుంచి రూ.2.40 లక్షల వరకు అందనుంది. ఈ పోస్టుకు విద్యార్హతలు సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా లేదా దానికి సమానమైన డిగ్రీ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. మరోవైపు.. పీఎంసీ, ఈపీఎస్, స్తిరాస్థి రంగం, మౌలిక సదుపాయాల రంగాల్లో కనీసం 15 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
అడిషనల్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్): ఈ కేటగిరీలో మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. పేస్కేల్ రూ.80 వేల నుంచి రూ.2.20లక్షలుగా ఉంది. దరఖాస్తుదారు ఎంబీఏ లేదా ఏదైనా రంగంలో రెండేళ్ల పోస్ట్ గ్యాడ్యుయేషన్ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే.. బిజినెస్ డెవలప్మెంట్ లేదా మార్కెటింగ్‌లో 12 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
ప్రాజెక్ట్ మేనేజర్(సివిల్): ఈ కేటగిరీలో మొత్తం 15 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జీతం రూ.60వేల నుంచి రూ.1.80 లక్షల వరకు అందనుంది. అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌కు సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. పీఎంసీ, ఈపీఎస్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్టక్చర్ రంగాల్లో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు వివరాలు: పైన పేర్కొన్న పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 9 నుంచి జూన్ 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఎన్బీసీసీ అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్‌ను చూడాలని సూచించింది సంస్థ.
ఇదీ చూడండి: ఎస్ఎస్సీలో 2,065 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
'సాఫ్ట్వేర్' కొలువుల జాతర.. TCS, HCL, ఇన్ఫీలో 1.30లక్షల ఉద్యోగాలు