ETV Bharat / bharat

'సిద్ధూకు పాక్​తో సంబంధాలు.. సీఎంను చేస్తే దేశానికే ప్రమాదం' - అమరీందర్ సిద్ధూ

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్​సింగ్ సిద్ధూపై (Navjot Singh Sidhu) మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌ (Amarinder Singh news) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. సిద్ధూ ముఖ్యమంత్రి అయితే దేశానికే ప్రమాదమని వ్యాఖ్యానించారు.

Amarinder Singh and Navjot Singh Sidhu
అమరీందర్ నవజ్యోత్ సింగ్
author img

By

Published : Sep 18, 2021, 8:20 PM IST

పంజాబ్ సీఎం పదవికి రాజీనామా (Punjab CM resign) చేసిన అమరీందర్ సింగ్ (Amarinder Singh news).. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్​సింగ్ సిద్ధూపై (Navjot Singh Sidhu) తీవ్ర ఆరోపణలు చేశారు. తదుపరి సీఎంగా సిద్ధూను ప్రతిపాదిస్తే తాను తిరస్కరిస్తానని అన్నారు. సిద్ధూ అసమర్థుడని, ఆయనకు పాకిస్థాన్​తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. (Amarinder Singh and Navjot Singh Sidhu) సిద్ధూ ముఖ్యమంత్రి అయితే దేశ భద్రతకే ప్రమాదమని హెచ్చరించారు.

"ఆయన(సిద్ధూ)కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​లతో స్నేహం ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా (Punjab next CM) ఆయన పేరు ప్రతిపాదిస్తే.. దేశ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తా. ఆయనో అసంపూర్ణమైన వ్యక్తి. సిద్ధూ దేశానికి విపత్తుగా మారే ప్రమాదం ఉంది."

-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం

శనివారం ఉదయం సోనియా గాంధీతో (Sonia Gandhi news) మాట్లాడినట్లు అమరీందర్ తెలిపారు. రాజీనామా విషయంపై చర్చించినట్లు చెప్పారు. దానికి 'అయామ్ సారీ' అని సోనియా బదులిచ్చారని వివరించారు. భాజపాలో చేరే అవకాశాలపై ప్రశ్నించగా.. ఎవరితోనూ చర్చించలేదని అమరీందర్ బదులిచ్చారు.

గవర్నర్ ఆమోదం

మరోవైపు, ఆయన (Amarinder singh resign) రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కాంగ్రెస్ అధిష్ఠానం (Congress Party) తన పట్ల వ్యవహరించే విధానంపై అసంతృప్తితో అమరీందర్ రాజీనామా చేశారు. తనను అవమానించారని కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.

పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా (Punjab next CM) ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, మంత్రి సుఖిందర్ రంధవా, మాజీ ముఖ్యమంత్రి రాజేందర్ కౌర్ భట్టల్​లో ఒకరిని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి:

సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్​ సింగ్​​ రాజీనామా

Punjab New CM: పంజాబ్ పీఠానికి ముగ్గురు పోటీ.. ఎవరికి దక్కేనో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.