ETV Bharat / bharat

'గృహిణులకు నెలకు రూ. 2వేలు, ఏడాదికి 8 సిలిండర్లు ఫ్రీ' - పంజాబ్​ కాంగ్రెస్ ఉచిత హామీలు

పంజాబ్​లో.. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలు మహిళలకు ఉచిత హామీలను ప్రకటిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే.. గృహిణులకు నెలకు రూ. 2వేలు ఇస్తామని పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ ప్రకటించారు. అంతేగాకుండా గృహ అవసరాలకు సంబంధించి 8 ఎల్​పీజీ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

Sidhu
నవజ్యోత్​ సింగ్ సిద్దూ
author img

By

Published : Jan 3, 2022, 8:25 PM IST

రానున్న పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహిళలపై 'ఉచిత' హామీల వర్షాన్ని కురిపించింది కాంగ్రెస్​ పార్టీ. తాము అధికారంలోకి వస్తే.. గృహిణులకు నెలకు రూ. 2వేలు ఇస్తామని ప్రకటించింది. అంతేగాకుండా గృహ అవసరాలకు సంబంధించి ఏడాదికి.. 8 ఎల్​పీజీ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ పీసీసీ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ వెల్లడించారు.

ఇదే క్రమంలో విద్యార్థులకు కూడా ఉచిత ప్రథకాలను ప్రకటించారు సిద్ధూ. కాలేజీలో అడ్మిషన్ పొందిన వెంటనే బాలికలకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపారు. ఇంటర్​ పాసైన విద్యార్థులకు రూ.20వేలు, 10వ తరగతి పాసైన వారికి రూ.15వేలు, 5వ తరగతి పాసైన వారికి రూ.5వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.

పంజాబ్​లోని బర్నాలా జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న సిద్ధూ ఈ హామీలను ఇచ్చారు. మహిళా సాధికారత కోసం ఈ హామీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పంజాబ్​లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ రూ.1,000 ఇస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. అంతకుమించి సిద్ధూ హామీలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మహిళా విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉచితంగా లాప్​టాప్​లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు సిద్ధూ. మహిళల పేరుపై ఆస్తులను బదిలీ చేసే ప్రక్రియను ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల శిక్షణకు 28 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

టీనేజర్లకు కరోనా టీకా​.. తొలి రోజు ఎంతమందికి అంటే...

'మోదీ అహంకారి' వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్ ఫైర్

'ఆపరేషన్​ కైలాస్​​ రేంజ్'ఎఫెక్ట్​.. ఆ సరస్సుపై చైనా వంతెన నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.