ETV Bharat / bharat

Family Health Survey: దేశంలో అత్యల్ప స్థాయికి సంతానోత్పత్తి రేటు! - నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​

National Family Health Survey: భారత దేశ జనాభా తగ్గుముఖం పడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తొలిసారి సంతానోత్పత్తి రేటు (India fertility rates) పలు రాష్ట్రాల్లో భారీగా తగ్గడం గమనార్హం. 2019-21 మధ్య జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించగా.. తాజాగా వెల్లడించిన రెండో నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా ఈ సర్వే ఏం చెప్పిందంటే..?

Family Health Survey
భారత జనాభా, సంతానోత్పత్తి రేటు
author img

By

Published : Nov 25, 2021, 1:33 PM IST

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా (Census of India) గల దేశంగా పేరొందిన భారత్‌లో గత కొన్నేళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 తాజా గణాంకాలు వెల్లడించాయి. 2019-21లో సగటు భారతీయ మహిళ (India sex ratio) ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక తొలిసారిగా సంతానోత్పత్తి రేటు (టీఎఫ్​ఆర్​).. రీప్లేస్‌మెంట్‌ రేటు కంటే దిగువకు పడిపోవడం ఓ మైలురాయి అని సర్వే చెబుతోంది.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ ఐదో ఎడిషన్‌ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలి విడత గణాంకాలను గతేడాది డిసెంబరులో బయటపెట్టగా.. రెండో విడత వివరాలను బుధవారం వెల్లడించారు.

  • దేశంలో సంతానోత్పత్తి రేటు 2గా ఉంది- అంటే 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
  • 2015-16లో నిర్వహించిన నాలుగో ఎడిషన్‌ సర్వేలో సంతానోత్పత్తి రేటు 2.2 శాతంగా ఉండగా.. ఇప్పుడు మరింత తగ్గింది.

రీప్లేస్‌మెంట్‌ రేటు (Replacement fertility rate) అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం. దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్‌ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటారు. ఇప్పుడు మన దేశంలో సంతానోత్పత్తి రేటు (total fertility rate) అంతకంటే తక్కువగా ఉండటం వల్ల జనాభా తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది. 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది.

2019-21లో ఐదు రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల సంతానోత్పత్తి రేటు 2 అంతకంటే తక్కువగానే ఉంది. బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, మణిపుర్‌లో మాత్రం ఇది ఇంకా రీప్లేస్‌మెంట్‌ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

ఏ రాష్ట్రంలో ఎలా?

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 2.4గా ఉండగా.. బిహార్‌లో 3గా తేలింది.
  • దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న రాష్ట్రం సిక్కిం. టీఎఫ్‌ఆర్‌ రేటు 1.1.
  • లద్దాక్​లో ఐదేళ్లలో గణనీయంగా తగ్గి 1.3కు చేరిన సంతానోత్పత్తి రేటు.
  • అండమాన్‌ నికోబార్‌, గోవాల్లోనూ బర్త్‌ రేటు 1.3గా ఉంది.

ఇప్పటికీ నలుగురిలో ఒకరికి..

దేశంలో బాల్యవివాహాలు (Child marriage in India) గతంలో కంటే తగ్గినప్పటికీ ఇప్పటికీ ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి 18 ఏళ్లు నిండకుండానే వివాహం జరుగుతోందని సర్వే గుర్తించింది.

  • 18 ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకొనే వారి సంఖ్య 2019-21లో 23.3 శాతం.
  • ఐదేళ్ల క్రితం ఇది 26.6 శాతంగా ఉంది.
  • కుటుంబ నియంత్రణ సాధనాలు వాడే వారి సంఖ్య 54 నుంచి 67 శాతానికి పెరిగింది.
  • ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించట్లేదని సర్వే స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: 'పటేల్ ఫొటో మనం పెట్టం కదా' కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై దుమారం

Corona cases in India: 539 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.