ETV Bharat / bharat

మార్కెట్​కు వెళ్లాలంటే రూ. 5 టోల్​ కట్టాల్సిందే!

కరోనా రెండో దశ విజృంభణతో మహారాష్ట్రలోని నాసిక్​ నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. కరోనాకు కేంద్రంగా భావిస్తున్న మార్కెట్లలో వైరస్​ వ్యాప్తి కట్టడికి కొత్త వ్యూహం రచించింది. ప్రజల వద్ద ప్రవేశ రుసుం వసూలు చేస్తూ.. గడువు విధిస్తోంది. ఈ విధానంతో మార్కెట్లలో రద్దీని తగ్గించొచ్చని, తద్వారా కరోనా తగ్గుముఖం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

author img

By

Published : Apr 1, 2021, 12:27 PM IST

మార్కెట్లలో కొవిడ్​ కట్టడికి రూ.5తో సరికొత్త వ్యూహం​!
curb the crowd in Market, covid-19

దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని కరోనా హాట్​స్పాట్లలో నాసిక్​ కూడా ఒకటి. అక్కడి కొవిడ్​ వ్యాప్తికి మార్కెట్లను ప్రధాన కారణంగా భావించిన నగరపాలక సంస్థ, పోలీసులు కలిసి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

plan
అధికారులకు వివరిస్తున్న పోలీసులు

ఎంట్రీ ఫీ..

నాసిక్​లోని మార్కెట్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడికి జనాన్ని నియంత్రించడమే పరిష్కారమని గుర్తించింది నగరపాలక సంస్థ. పోలీసులతో చేతులు కలిపి కొత్త టోల్​ ప్లాన్​ విధానాన్ని తీసుకొచ్చింది. మార్కెట్లోకి ఎవరైనా ప్రవేశించాలంటే రూ. 5 చెల్లించి ఎంట్రీ పాస్​ తీసుకోవాల్సిందే. దీని గడువు గంట మాత్రమే. అంతకుమించి సమయం మార్కెట్లో ఉంటే రూ. 500 జరిమానా విధిస్తున్నారు.

ENTRY PASS
ఎంట్రీ పాస్​లు ఇస్తున్న అధికారులు

నగరంలో కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఇలా కఠిన చర్యలకు ఉపక్రమించింది స్థానిక యంత్రాంగం.

ENTRY PASS
ఎంట్రీ టికెట్​ చూపిస్తున్న ఓ మహిళ

ప్రస్తుతం షాలీమార్​, తిలక్​పాత్​, బాద్షాహీ కార్నర్​, దుమాల్​ పాయింట్​, శివాజీ రోడ్​, సిటీ సెంటర్​ మాల్​ వంటి ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కొద్దిరోజులుగా కొవిడ్​ నిబంధనల్ని లెక్కచేయట్లేదని, జరిమానాల భయంతో ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెబుతున్నారు. త్వరలో ఈ విధానాన్ని నగరమంతా విస్తరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

POLICE IN MARKETS
మార్కెట్లలో పోలీసుల పహారా

ఇదీ చూడండి: కరోనా కల్లోలం- భారత్​లో ఒక్కరోజే 72 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.