ETV Bharat / bharat

మాజీ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం - కమల్​నాథ్​ లిఫ్ట్​ ప్రమాదం

మధ్యప్రదేశ్​ మాజీ సీఎం కమల్​నాథ్​ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డీఎన్​ఎస్​ ఆస్పత్రిలో కమల్​నాథ్​ సహా పలువురు నేతలు ఎక్కిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందకు పడిపోయింది. ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నట్లు కమల్​నాథ్ ప్రతినిధి తెలిపారు.

madhya pradesh cm
మధ్యప్రదేశ్​ మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం
author img

By

Published : Feb 22, 2021, 9:14 AM IST

మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్ కమల్​నాథ్​కు​ తృటిలో ప్రమాదం తప్పింది. ఇండోర్​లోని డీఎన్​ఎస్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్​ పటేల్​ను ఆదివారం పరామర్శించేందుకు కమల్​నాథ్​ సహా పలువురు నేతలు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఉన్న లిఫ్ట్ ​అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు లిఫ్ట్​లో కమల్​నాథ్​తో పాటు మాజీ మంత్రులైన సజ్జన్​ వర్మ, జితు పట్వారీ, ఎమ్మెల్యే విశాల్​ పటేల్, సిటీ కాంగ్రెస్ చీఫ్ వివేక్ బకిల్వాల్, భద్రత సిబ్బంది ఉన్నారు.

madhya pradesh cm
మధ్యప్రదేశ్​ మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం
madhya pradesh cm
మధ్యప్రదేశ్​ మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం

"మాజీ సీఎం కమల్​నాథ్​ సహా పలువురు నేతలు డీఎన్​ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామేశ్వర్​ పటేల్​ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లారు. వారు ఎక్కిన లిఫ్ట్ అకస్మత్తుగా 10 ఫీట్ల దిగువకు పడిపోయింది. లాక్​ అయిన లిఫ్ట్​ తలుపులు తెరవడానికి 15 నిమిషాలు పట్టింది. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా పరిగణించి, ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి."

-నరేంద్ర సలూజా, కమల్​నాథ్​ ప్రతినిధి

ఈ ఘటనపై స్పందించిన కమల్​నాథ్​.. భగవంతుడి కృప తనపై ఎల్లప్పుడూ ఉందని ట్వీట్​ చేశారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి : నేడు అసోం, బంగాల్​లో మోదీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.