ETV Bharat / bharat

'రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే'

త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్ పర్యటించారు. నూతన సాగు చట్టాలపై రైతుల్లో నెలకొన్న ఆందోళనలపై సానుకూలంగా స్పందిస్తున్నామన్నారు. రైతులతో మాట్లాడటానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.

AS-TOMAR-FARMERS (R)
అసోంలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
author img

By

Published : Feb 18, 2021, 10:43 PM IST

దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులతో చర్చించడాానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అసోంలో గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

చట్టాలపై నిబంధనలకు అనుగుణంగా చర్చించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటించారని తోమర్ గుర్తుచేశారు. రైతులతో చర్చలపై కేంద్రం సిద్ధంగా ఉందా అనే విలేకరుల ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అయితే చర్చలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన చెప్పలేదు.

''నిరసన తెలుపుతోన్న రైతులను క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నాం. చట్టాల నిబంధనలపై చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్​లో వ్యవసాయ రంగ శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రతిపాదించాం.''

- నరేంద్ర సింగ్​ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి

ఫలించని కేంద్రం మంత్రం..

చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్న రైతులు.. నేడు దేశవ్యాప్తంగా 'రైలు రోకో' చేపట్టారు. జనవరి చివరి వారంలో 10వ రౌండ్ చర్చల అనంతరం నూతన సాగు చట్టాలను 1.5 సంవత్సరాలు నిలుపుదల చేయడానికి కేంద్రం ప్రతిపాదించగా రైతులు అంగీకరించలేదు.

ప్రతిపక్షాలకు లబ్ధి..

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న అసోంలో.. రైతు ఆందోళనలను ప్రతిపక్షాలు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నాయి. మరోవైపు.. చట్టాల వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని తోమర్​ వివరించారు.

ఇదీ చదవండి: 'వ్యవసాయమూ చేస్తాం.. ఆందోళనలూ కొనసాగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.