ETV Bharat / bharat

నారదా కుంభకోణం కేసులపై నేడు విచారణ

నారదా స్కామ్​ కేసులపై విచారణ చేపట్టిన కోల్​కతా హైకోర్టు నేటికి వాయిదా వేసింది. అరెస్టు అయిన వాళ్ల బెయిల్​ మంజూరుతో పాటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్​లను ఇవాళ పరిశీలించనుంది.

narada scam, నారదా కుంభకోణం బంగాల్
నారదా స్కామ్​హై కోల్​కతా హైకోర్టు
author img

By

Published : May 20, 2021, 8:48 AM IST

నారదా కుంభకోణం వ్యవహారానికి సంబంధించిన కేసులపై కోల్​కతా హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు నేటికి వాయిదా వేసింది. ప్రస్తుతం రెండు కేసులు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి.. అరెస్టయిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, కోల్​కతా మాజీ మేయర్​లకు బెయిల్​ మంజూరుకు సంబంధించిన కేసు. రెండోది ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన మరో పిటిషన్. ఈ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, న్యాయమంత్రి మలయ్​ ఘటక్​, తృణమూల్​ ఎంపీ కల్యాణ్​ బెనర్జీలను కక్షిదారులుగా సీబీఐ పేర్కొంది. అరెస్టులకు నిరసనగా ముఖ్యమంత్రి సీబీఐ కార్యాలయంలో ధర్నా చేశారని, న్యాయమంత్రి కోర్టుకు వచ్చి కూర్చొన్నారని తెలిపింది. ఇవి అసాధారణ పరిస్థితులు అయినందున కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేశ్​ బిందాల్​, జస్టిస్​ ఆర్జిత్​ బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. విచారణ వాయిదా పడటం వల్ల ఆ నలుగురు నాయకులు బుధవారం కూడా జైలులో గడపాల్సి వచ్చింది.

పోలీసుల నివేదిక కోరిన గవర్నర్

నిషేదాజ్ఞలు ఉన్నప్పటికీ రాజ్​భవన్ వద్ద వరుసగా ధర్నాలు జరుగుతుండడాన్ని గవర్నర్ జగదీప్​ ధన్​ఖడ్​ తీవ్రంగా పరిగణించారు. దీనిపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ ట్వీట్​ చేశారు. రాజ్​భవన్​ వద్ద గొర్రెలతో ధర్నా చేసినా చర్యలు తీసుకోలేదంటూ ఫోటోను కూడా జత చేశారు. కాగా, కరోనా సంక్షోభాన్ని పట్టించుకోకుండా గవర్నర్ వేరే వ్యవహారాలపై దృష్టి పెట్టినందునే గొర్రెలతో ధర్నా చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి : 'మా సహనాన్ని పరీక్షించొద్దు.. చర్చలు జరపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.