ETV Bharat / bharat

నారదా కేసు: సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ - సీబీఐ తాజా వార్తలు

నారదా స్టింగ్ కేసులో మంత్రులను గృహ నిర్బంధంలో ఉంచాలని కోల్​కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. గత సోమవారం ఈ కేసులో నేతలను సీబీఐ అరెస్టు చేసింది.

cbi
నారదా స్టింగ్ కేసు
author img

By

Published : May 24, 2021, 11:46 AM IST

నారదా స్టింగ్ కేసులో మంత్రులను గృహ నిర్బంధంలో ఉంచాలని మే 21న కోల్​కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సుప్రీంకోర్టును సోమవారం ఆశ్రయించింది. ఈ కేసులో బంగాల్​ మంత్రులు ఫిర్హాద్​ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్​ మిత్రా, మాజీ మేయర్​ సోవన్ ఛటర్జీని గత సోమవారం సీబీఐ అరెస్టు చేసింది.

నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్​ ఇవ్వగా, దాన్ని సవాలు చేస్తూ సీబీఐ.. కోల్​కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాజేశ్​ బిందాల్​, జస్టిస్​ అర్జిత్​ బెనర్జీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. బెయిల్ మంజూరు చేసే విషయంలో ఇరువురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దాంతో నిందితులను గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించారు. అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి ఈ కేసును అప్పగించారు. కాగా.. ఈ కేసు విచారణ సోమవారం ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది.

ఇదీ చూడండి: రాజకీయ కేంద్ర దర్యాప్తు సంస్థ.. రాజ్యాంగ నైతికత ఏది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.