ETV Bharat / bharat

'అతివాదంతో సమస్యల పరిష్కారం అసాధ్యం' - ఉపరాష్ట్రపతి

సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు. అతివాదంతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకబోదని, చర్చల ద్వారానే అది సాధ్యమవుతుందని రైతులకు పిలుపునిచ్చారు.

Naidu favours moderation while using social media to prevent abuse, calls for ending farmers' stir
'ఆ వేదికలను దుర్వినియోగం చేయడం సరికాదు'
author img

By

Published : Feb 13, 2021, 5:17 AM IST

Updated : Feb 13, 2021, 7:11 AM IST

అతివాదంతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకబోదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సంయమనం పాటించినప్పుడే సరైన పరిష్కార మార్గాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతర్లీనంగా ఈ సూత్రం దాగుందన్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమానికి తెరదించే దిశగా ప్రభుత్వం, రైతులు చర్చలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ తొలి విడత సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఈ దఫా సమావేశాల తొలి దశలో రాజ్యసభ దాదాపు 100శాతం ఉత్పాదకత సాధించిందంటూ ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు ఇతర సభ్యుల వీడ్కోలు సందర్భంగా అధికార, విపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించడం శుభ పరిణామమని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల నియంత్రణ విధానానికి తాను వ్యతిరేకమని వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే- ప్రభావవంతమైన అలాంటి వేదికలను దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. సమాజంలో మంచి దృక్పథాన్ని పెంపొందించడం సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టే పోస్టుల లక్ష్యం కావాలని.. అంతేతప్ప అవి రెచ్చగొట్టేలా, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని సూచించారు.

ఇదీ చూడండి: రాజ్యసభ ప్రోడక్టివిటీ 99 శాతం: వెంకయ్య

Last Updated : Feb 13, 2021, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.