ETV Bharat / bharat

నాగాలాండ్​లో మళ్లీ ఎన్డీపీపీ-బీజేపీ విజయం - నాగాలాండ్​ ఎన్నికలు

నాగాలాండ్​లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి 37 సీట్లలో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మరోసారి ప్రభుత్వాన్ని ఈ కూటమే ఏర్పాటు చేయనుంది. ఎన్​సీపీ 7 చోట్ల, ఎన్​పీపీ 5 చోట్ల విజయం సాధించింది.

Nagaland Elections Results 2023
నాగాలాండ్​ ఎన్నికల తీర్పు 2023
author img

By

Published : Mar 2, 2023, 2:51 PM IST

Updated : Mar 2, 2023, 9:04 PM IST

నాగాలాండ్​లో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)- నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఆ రాష్ట్రంలో పాగా వేసింది. ఈ కూటమి 37 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఆధిక్యాన్ని అధికార కూటమి దక్కించుకుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న నాగాలాండ్​లో ఇప్పటికే ఒక సీటు ఏకగ్రీవం కాగా.. మిగతా 59 స్థానాలకు గానూ 183 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నాగా ఓటర్లు ఫిబ్రవరి 27న బ్యాలెట్​ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. కాగా, గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నాగాలాండ్​లో జరిగిన ఎన్నికల్లో ఈ సారి 13 లక్షల మంది ఓటర్లలో 85.90 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎగ్జిట్​ పోల్స్​ సర్వేలు కూడా నాగాలాండ్​లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమియే మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి.

2023 నాగాలాండ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు..

  • ఎన్డీపీపీ+భాజపా-37
  • ఎన్​సీపీ-7
  • ఎన్​పీపీ-5
  • ఇతరులు-11

ఎన్నికలు జరగకుండానే..
అకులుటో శాసనసభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఖేకషీ సుమి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం వల్ల భాజపా అభ్యర్థి కజేటో కినిమి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికలు జరగకుండానే బీజేపీ ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఆ నాలుగు స్థానాల్లో..
అయితే పలు సాంకేతిక కారణాలతో 4 పోలింగ్​ స్టేషన్లలో రీపోలింగ్​కు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో బుధవారం(మార్చి 1న) ఈ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది. నాగాలాండ్​లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు మొత్తం 183 మంది పోటీ పడ్డారు. ఇక ఈసారి నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో ఉత్తర అంగామి స్థానం నుంచి పోటీ చేయగా.. ఆయనకు పోటీగచా సెయివిలీ చాచును బరిలోకి దింపింది కాంగ్రెస్. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి యంతుంగో పాటన్‌ బీజేపీ తరఫున త్యుయ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఈ పార్టీలు ఇన్ని స్థానాల్లో..
ప్రతిపక్షాలైన కాంగ్రెస్​, ఎన్​పీపీ, ఎన్​సీపీ, జేడీయూ సహా ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఈ ఎన్నికల బరిలో పోటీకి నిలిపాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ 40 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలపగా, ఎన్డీపీపీ 20 స్థానాల్లో పోటీ చేసింది. నాగా పీపుల్స్​ ఫ్రంట్​(ఎన్​పీఎఫ్​)-22 స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఎన్​సీపీ అభ్యర్థులు 12 చోట్ల పోటీ చేయగా.. ఆర్​పీపీ-1, జేడీయూ-7, ఎల్​జేపీ-15, ఆర్​పీఐ-9, ఆర్జేడీ-3, స్వతంత్రులు-19 స్థానాల్లో పోటీ చేశారు. చివరగా 2003లో నాగాలాండ్​ను పాలించిన కాంగ్రెస్​కు ప్రస్తుతం నాగాలాండ్​ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేడు. ఇకపోతే ఈ ఎన్నికల్లో 23 స్థానాల్లో తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపింది హస్తం పార్టీ.

కలిసొచ్చిన ప్రచారం..
నాగాలాండ్​ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, బీజేపీ అగ్రనేతలు తమ పార్టీ తరఫున చేసిన ప్రచారం ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో నాగా పీపుల్స్​ ఫ్రంట్​ పార్టీ 26 స్థానాల్లో గెలుపొందింది. అలాగే బీజేపీ 12, ఎన్​డీపీపీ 18 స్థానాల్లో విజయం సాధించగా.. ఈ రెండు పార్టీలు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

Last Updated : Mar 2, 2023, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.