బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తుంటే మమతా బెనర్జీ ఎందుకు డుమ్మా(హాజరు కావడం లేదని) కొడుతున్నారని ప్రశ్నించారు.
బంగాల్ భాజపాకు వస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ తీవ్ర అసహనానికి గురవుతున్నారని..అందుకే భాజపా కార్యకర్తలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. మండ్లాలోని మాణిక్ చక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న భాజపా అభ్యర్థి తరపున దిల్లీనుంచి వర్చువల్‌గా నడ్డా ప్రచారం నిర్వహించారు.
"కరోనా కట్టడిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తే మీరు(మమతా బెనర్జీ) ఎందుకు హాజరుకాలేదు. అందుకు మీ అహం అడ్డొచ్చిందా?"
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
అంతేకాకుండా "రాష్ట్రంలో కరోనా టీకాలు లేవని మమత అంటున్నారు. మరి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన రోజూవారి లెక్కల్ని కేంద్ర ఆరోగ్య శాఖకు ఎలా పంపిస్తున్నట్లు?" అని ప్రశ్నించారు.
పదేళ్లుగా ప్రజలకు నిత్యవసర సరకులు దక్కకుండా మమత చేశారని నడ్డా ఆరోపించారు. బంగాల్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిపోయిందని, అందుకు తృణమూల్ కాంగ్రెస్ కారణమని ఆరోపించారు.
ఇదీ చదవండి: బంగాల్ బరి: ఏడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం