ETV Bharat / bharat

'లౌకికవాదం చెక్కుచెదరలేదు.. భారత్​లో ముస్లింలు సురక్షితం'

భారత్​లో ముస్లింలు (Muslims in India) సురక్షితంగా ఉన్నారని అన్నారు ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్​. దేశంలో లౌకికవాదం (Secularism in India) చెక్కుచెదరలేదన్నారు. ఈటీవీ భారత్​తో మాట్లాడిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Muslims in India safe, secularism still intact here
తస్లీమా నస్రీన్​, భారత ముస్లింలు
author img

By

Published : Nov 17, 2021, 7:00 AM IST

భారత్​లో ఉన్న ముస్లింలు (Muslims in India) అందరూ సురక్షితంగా ఉన్నారని.. పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ తరహాలో మైనార్టీలకు (Minorities in India) ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవని ప్రసిద్ద రచయిత్రి తస్లీమా నస్రీన్​ అన్నారు. అతితక్కువ సంఖ్యలో ఉన్న మతోన్మాద హిందువులను చూపి మొత్తం దేశమంతా ఇలాగే ఉందనడం సరికాదన్నారు. మంగళవారం దిల్లీలో ఆమె 'ఈటీవీ భారత్​' పలు అంశాలపై మాట్లాడారు.

  • ''అమెరికా, ఐరోపాలతో పోలిస్తే భారత ఉపఖండంలోనే పితృసామ్యం, స్త్రీ ద్వేషం ఎక్కువ. ఈ విషయంలో దేశంలో ఉన్నది నిజమైన ప్రజాస్వామ్యం కాదు. చట్టపరంగా స్త్రీలకు సమాన హక్కులున్నప్పటికీ వాస్తవ కోణంలో చూస్తే సంప్రదాయాలు, మతపరమైన చట్టాలు స్త్రీల స్వేచ్ఛను హరిస్తున్నాయన్నారు. అయితే ఇటీవలి కాలంలో చేస్తున్న చట్టాలు మతం ఆధారంగా కాకుండా, సమానత్వం ప్రాతిపదికపైనే రూపొందిస్తుండటం మహిళలకు ఊరటనిస్తోంది.
  • చాలామంది భారత్​లో మునుపటి లౌకికవాదం (Minorities in India) లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. దేశంలో లౌకికవాదానికి రాజ్యాంగమే రక్షణగా ఉంది. కొన్నిసార్లు, కొన్నిప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య (Taslima nasreen on hinduism) స్వల్ప ద్వేషం ఉంటుంది. అలాగని ఇక్కడి మైనార్టీలు ఎక్కడికీ వలస వెళ్లడం లేదు. పొరుగు దేశాల్లో ఇలాంటి పరిస్థితులు లేవు.
  • ఇప్పటివరకు 45 పుస్తకాలు (Taslima nasrin books) రాశాను. ఎక్కువగా మహిళల హక్కులపై రాసినవే. నా జ్ఞాపకాలు, స్వగతాలనే మహిళలను ప్రేరేపించేలా రాశాను. అయినా ఈ విషయంలో సంతృప్తి లేదు. ఇంకా బాగా రాయాలనే తపన ఉంది.
  • ''నేటితరం మహిళలు బాగా చదువుకొని, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి'' అన్నదే నా సూచన.

ఇవీ చూడండి: ప్రవచనాలు చెబుతూనే ప్రాణం వదిలిన స్వామీజీ.. పుట్టిన రోజు నాడే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.