ETV Bharat / bharat

రాముడికి ముస్లిం మహిళ హారతి.. 15 ఏళ్ల సంప్రదాయం కొనసాగిస్తూ... - diwali

ప్రతి దీపావళికి రాముడికి హారతి ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించారు వారణాసికి చెందిన ముస్లిం మహిళ నంజీన్ అన్సారీ. స్వహస్తాలతో, భక్తి శ్రద్ధలతో రాముడికి (Prayers to Lord Rama) పూజలు చేశారు.

muslim woman aarti to lord ram
రాముడికి ముస్లిం మహిళ హారతి
author img

By

Published : Nov 4, 2021, 6:43 PM IST

రాముడికి ముస్లిం మహిళ హారతి

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో (Varanasi news today) ముస్లిం మహిళ రామ మందిరంలో పూజలు (Prayers to Lord Rama) నిర్వహించారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాముడికి మహా హారతి ఇచ్చారు. గత 15 ఏళ్లుగా ప్రతి దీపావళికి శ్రీరాముడికి హారతి ఇస్తున్నారు నంజీన్ అన్సారీ. తమ చేతులతో స్వయంగా హారతి ఇస్తున్నారు.

స్వయంగా పాటలు పాడుతూ మహా హారతి ఇస్తున్నారు అన్సారీ. ఆమెతో పాటు మరికొందరు ముస్లిం మహిళలు సైతం ఈసారి పూజకు హాజరయ్యారు. వేదపండితులు అన్సారీతో కలిసి పూజలు చేశారు.

ఏటా రాముడి చిత్రపటానికి హారతి ఇస్తున్న మహిళ.. ఈసారి నూతనంగా ఏర్పాటు చేసిన రాముడి విగ్రహానికి పూజలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మితమవుతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది పూజలను అయోధ్య రాముడి పేరు మీద చేశారు.

ఇదీ చదవండి: దేశంలో ఘనంగా దీపావళి- నరకాసుర వధతో సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.