ETV Bharat / bharat

ఈ దున్నపోతు ధర రూ.24 కోట్లు- విదేశాలకు వీర్యం!

author img

By

Published : Nov 19, 2021, 6:30 PM IST

Updated : Nov 19, 2021, 6:54 PM IST

దున్నపోతుల ప్రదర్శనలో (pushkar fair rajasthan) 'భీమ్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 6 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవుతో ఉన్న ఈ దున్న విలువ రూ.24 కోట్లు అని దాని యజమాని తెలిపారు. దీని వీర్యాన్ని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.

ajmer pushkar fair
ajmer pushkar fair
ముర్రా జాతి దున్న భీమ్

రాజస్థాన్​లోని అజ్మేర్​లో నిర్వహించిన పుష్కర్ ఫెయిర్​లో (pushkar fair 2021) భారీ దున్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరు అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవుతో ఉన్న ఈ ప్రత్యేకమైన ముర్రా జాతి దున్నను (pushkar fair rajasthan) జవహర్​లాల్ జంగీడ్ అనే వ్యక్తి ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ ఎద్దు విలువ రూ.24 కోట్లని (24 crore buffalo) జవహర్ వెల్లడించారు. దీనికి తాము 'భీమ్' పేరు పెట్టినట్లు తెలిపారు. 1500 కేజీల బరువు ఉన్న ఈ ఎద్దును చూసి సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

BUFFALO BHIM
దున్నపోతు 'భీమ్'
BUFFALO BHIM
భీమ్

భీమ్ వీర్యానికి భారీగా డిమాండ్ (murrah buffalo price 2021) ఉందని జవహర్ చెప్పారు. విదేశాలకు సైతం ఈ దున్న వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఐదారు దేశాల నుంచి తమకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. దీని వీర్యాన్ని ఉపయోగించి.. ఇలాంటి దున్నలను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు.

BUFFALO BHIM
ప్రదర్శనలో దున్న

20 లీటర్ల పాలు..

సాధారణ జాతి గేదెలు రోజుకు 7-10 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయని జవహర్ తెలిపారు. ముర్రా జాతి గేదెలు తొలి కాన్పు తర్వాత 15-16 లీటర్లు, రెండు-మూడు కాన్పుల అనంతరం 20 లీటర్లకు పైగా పాలు (murrah buffalo milk per day) ఇస్తాయని వివరించారు. ఈ దున్నను విక్రయించే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. సందర్శన కోసం మాత్రమే వీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. భీమ్​ను చూసి ఇలాంటి గేదె, దున్నలను పెంచుకోవాలని రైతులకు అవగాహన రావాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు.

ఇదీ చదవండి: ఎద్దు ధర రూ.కోటి.. గొర్రె విలువ రూ.10లక్షలు.. ప్రత్యేకతలు ఇవే...

Last Updated : Nov 19, 2021, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.