ETV Bharat / bharat

దళిత బాలికపై గ్యాంగ్​ రేప్, హత్య.. పోలీసులపై కాల్పులు

Gang rape: దళిత బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ నిందితుడికి తూటాలు తగిలాయి. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో జరిగింది.

gangrape
దళిత బాలికపై గ్యాంగ్​ రేప్
author img

By

Published : Feb 6, 2022, 12:27 PM IST

Updated : Feb 6, 2022, 4:17 PM IST

Gang rape: ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో​ అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో ఒకరిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

నవాబ్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం బాలిక మృతదేహాన్ని పంట పొలాల్లో కనుగొన్నారు స్థానికులు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్​ మార్కండేయా షాహి, ఎస్పీ సంతోష్​ మిశ్రా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను పట్టించిన వారికి రూ.25వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. కేవలం 5 గంటల్లోనే దుండగుల సమాచారం తెలుసుకున్నారు.

"నవాబ్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో దళిత బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఇప్పటి వరకు ఒక నిందితుడ్ని పట్టుకున్నాం. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. "

- జిల్లా ఎస్పీ సంతోష్​ మిశ్రా.

ఎన్​కౌంటర్​లో తూటా గాయాలు..

గ్రామం సమీపంలోని ఓ చెరకు తోటలో నిందితులు తలదాచుకున్నట్లు తెలుసుకుని చుట్టుముట్టారు పోలీసులు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకునేందుకు నిందితులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఓ నిందితుడికి తూటాలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేశ్​ యాదవ్​ను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆయనతో సంబంధంపై పుస్తకం రాసేందుకు సిద్ధం'

Last Updated : Feb 6, 2022, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.