ETV Bharat / bharat

ముంద్రా పోర్టులో మళ్లీ డ్రగ్స్ కలకలం.. 25వేల కేజీలు సీజ్!

mundra port drug seizure: ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.5 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగాల్​లో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jan 25, 2022, 1:41 PM IST

Updated : Jan 25, 2022, 2:08 PM IST

25,000 kg poppy seeds worth Rs 3.5 crore seized

Mundra port drug seizure: గుజరాత్​లోని ముంద్రా పోర్టులో మరోసారి భారీ ఎత్తున మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి! 25,000 కేజీల బరువున్న వెయ్యి పాపీ సీడ్స్​(గసగసాల) ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.5 కోట్లు అని తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) ఇచ్చిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు వీటిని గుర్తించారు. ముంద్రా పోర్టులోని సీబర్డ్ సీఎఫ్ఎస్ కంటైనర్​లో అమ్మోనియం సల్ఫేట్​ బస్తాల కింద వీటిని దాచినట్లు తెలిపారు.

Poppy seeds drugs seizure

గసగసాల గింజలను మత్తు పదార్థంగా వర్గీకరిస్తారు. వివిధ ప్రపంచ దేశాల్లో దీనిపై నిషేధం ఉంది. భారత్​లోనూ దీన్ని మత్తు పదార్థంగానే భావిస్తారు. అందువల్ల, దీనిని ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా నార్కోటిక్స్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

దిల్లీ కంటైనర్ డిపోలో రిజిస్టర్ అయిన ఓ వ్యాపారి పేరు మీద ఈ బస్తాలు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. స్మగ్లింగ్ కోసమే వీటిని రవాణా చేసినట్లు భావిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇక్కడ మత్తుపదార్థాలు పట్టుబడటం ఇది రెండోసారి. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

బ్రౌన్ షుగర్ అక్రమ రవాణా

మరోవైపు, బంగాల్​లో రూ.రెండు కోట్ల విలువైన బ్రౌన్ షుగర్​ను పోలీసులు సోమవారం రాత్రి సీజ్ చేశారు. ఈ మత్తుపదార్థాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రక్కు డ్రైవర్​ను అరెస్టు చేశారు. సిలిగుడి మెట్రోపాలిటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎన్​డీపీఎస్ చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

BROWN SUGAR
రూ. 2 కోట్ల విలువైన బ్రౌన్​ షుగర్​ పట్టివేత

Odisha Police seizes brown sugar

ఒడిశాలో కూడా పెద్దమొత్తంలో బ్రౌన్​ షుగర్​ పట్టుబడింది. దీని విలువ రూ. 3 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు అధికారులు. నయాగఢ్​ జిల్లాలో ఓ ఇంట్లో ప్రత్యేక కార్య దళం తనిఖీలు నిర్వహించగా.. డ్రగ్స్​ బండారం బయటపడింది. ఘటనా స్థలం నుంచి మరో రూ. 65 లక్షలు, 3 రివాల్వర్లు స్వాధీనం కూడా లభ్యమయ్యాయి.

ఘటనకు సంబంధించి ఒకర్ని అరెస్టు చేశారు పోలీసులు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: కాళ్లు, చేతులు కట్టేసుకొని.. 5 గంటల్లో సముద్రాన్ని ఈదిన వృద్ధుడు

Last Updated : Jan 25, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.